ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది.ఇందులో భాగంగా తాజాగా ఇది రెండు ఫీచర్లను ఇంట్రడ్యూస్ చేసింది.
హోమ్ పేజీ నావిగేషన్ మరింత సులభతరం చేసేందుకు యాప్‌ను రీడిజైన్ చేసింది.ఈ కొత్త డిజైన్ పట్టణ, గ్రామీణ ప్రజలకు బాగా ఉపకరిస్తుంది.
యాప్‌లో హోమ్ పేజీని రీడిజైన్ చేసిన ఫ్లిప్‌కార్ట్ కిరాణా షాపింగ్ కొరకు స్పెషల్‌గా ఒక సెక్షన్ కూడా తీసుకొచ్చింది.ఇలా సరికొత్త హోమ్ పేజీ నావిగేషన్, కిరాణా షాపింగ్ సెక్షన్ అనే 2 ఫీచర్లను ఫ్లిప్‌కార్ట్ లాంచ్ చేసింది.
ఆండ్రాయిడ్ కస్టమర్లకు ఈ కొత్త డిజైన్ ఇప్పటికే అందుబాటులోకి రాగా ఐఓఎస్ యూజర్లకు జూన్‌లో రిలీజ్ కానుంది.
సరి కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో షాపింగ్, కార్ట్, నోటిఫికేషన్లు వంటివి స్క్రీన్ కింది భాగంలో కనిపిస్తాయి.
దీని వల్ల కేవలం బొటనవేలితో అన్ని ఆప్షన్లను చకచకా యాక్సెస్ చేయొచ్చు.కిరాణా షాపింగ్ అనేది యాప్‌లో స్పష్టంగా కనిపించేలా స్క్రీన్ కింద ఇవ్వటం వల్ల అందరూ తెలుసుకోగలుగుతారు.
దీనివల్ల ఎక్కువమంది కిరాణా వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

వాస్తవానికి కిరాణా సామాగ్రి ద్వారానే ఫ్లిప్‌కార్ట్‌కు అధిక లాభం వస్తుంది.ఇక ఈ కంపెనీ దానికోసం ప్రత్యేకంగా ఒక సెక్షన్ తీసుకొచ్చింది.సిటీలలో ఉండే చాలా మంది ప్రజలు కిరాణా వస్తువులను కొనుగోలు చేసేందుకు ఫ్లిప్‌కార్ట్‌పైనే ఆధారపడుతున్నారు.
ఈ కొత్త ఫీచర్లు అటు యూజర్లకు ఇటు ఫ్లిప్‌కార్ట్‌కి బాగా హెల్ప్ అవుతాయి.