సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పుడు దర్శకులు స్టార్ హీరోలు కూడా ఒక ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.ట్రెండ్ కు అనుగుణంగా అన్ని సినిమాలు తీస్తూ ఉంటారు.
కాగా ఇప్పుడు టాలీవుడ్లో దర్శక నిర్మాతలు తాము తీసే సినిమాలకు కాస్త పొలిటికల్ టచ్ ఇవ్వాలని భావిస్తున్నారు అనేది తెలుస్తుంది.ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారూ హీరోలు.
ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు తన కెరీర్లో ఎన్నో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాల్లో నటించారు.
ఇక రాబోయే చిత్రం గాడ్ ఫాదర్ కూడా ఇలాంటి ఈ కోవకు చెందినదే అన్న విషయం తెలిసిందే.మోహన్ రాజా డైరెక్షన్ లో వస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో జన జాగృతి పార్టీ లీడర్ గా కనిపించ బోతున్నారు మెగాస్టార్ చిరంజీవి.
ఏకంగా రాజకీయాలను శాసించే టార్చ్ బేరర్ గా చిరంజీవి కనిపించబోతున్నారు అన్నది తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో నయనతార కీలక పాత్రలో నటిస్తోంది.ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
మరోవైపు రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూడా పొలిటికల్ నేపథ్యంలోనే తెరకెక్కుతుందని తెలుస్తోంది.
అచ్చంగా ఒక్కడు సినిమా సీక్వెల్ గా ఈ సినిమా ఉండబోతోందని అంటున్నారు కొంతమంది.అభ్యుదయ పార్టీ లీడర్ గా చరణ్ కనిపించబోతున్నాడట.కాగా జూనియర్ ఎన్టీఆర్ గతంలో రాజకీయ నేపథ్యం లో ఉన్న చాలా సినిమాల్లో నటించాడు.అయితే ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా పవర్ ఫుల్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది అని తెలుస్తోంది.
ఈ సినిమాతో సక్సెస్ అందుకున్న బాలకృష్ణ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో పవర్ ఫుల్ మాస్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో నటించబోతున్నాడట.నితిన్ మాచర్ల నియోజకవర్గం, పవన్ కళ్యాణ్ భవదీయుడు భగత్ సింగ్, వైష్ణవ్ తేజ్ రంగ రంగ వైభవంగా సినిమాలు కూడా ఇలాంటి ఇలాంటి బ్యాక్ డ్రాప్ లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి అని తెలుస్తోంది.