పవన్ ప్రకటన తొందరపాటేనా ? వారే చేతులెత్తేశారుగా

ఇప్పుడిప్పుడే ఏపీలో జనసేన పార్టీకి ఆదరణ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.తెలుగుదేశం పార్టీ గతం కంటే బాగా బలహీనపడడం, గతంలో మాదిరిగా టిడిపి అధినేత చంద్రబాబు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న లేకపోవడం,  ఆయన తర్వాత టిడిపిలో ఆ స్థాయిలో నాయకత్వ లక్షణాలు ఉన్న వారు లేకపోవడం ఇలా ఎన్నో కారణాలతో ఇప్పుడు వైసీపీకి ప్రధాన ప్రత్యర్థిగా జనసేన  మారుతోంది .

 Pawan Kalyans Announcement That He Will Contest In Telangana Is Being Discussed-TeluguStop.com

దీనికి తగ్గట్లుగానే 2024 ఎన్నికల్లో జనసేన , బీజేపీ కూటమి తో పొత్తు పెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది.ఈ విషయంలో పవన్ ఒప్పించేందుకు రకరకాల మార్గాల ద్వారా ప్రయత్నాలు చేస్తోంది.

పొత్తులో భాగంగా కోరినన్ని సీట్లు ఇచ్చేందుకు టిడిపి మొగ్గు చూపిస్తోంది.కానీ ఈ విషయంలో బిజెపి అడ్డంకిగా మారింది.

 ఇదిలా ఉంటే ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణపై దృష్టి పెట్టారు.ఇటీవల ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆయన పర్యటనకు భారీ స్థాయిలో స్పందన వచ్చింది.

హైదరాబాద్ నుంచి కోదాడ వరకు భారీ స్థాయిలో జనసైనికులు తరలిరావడం తో ఆయన పర్యటన విజయవంతం అవ్వడం వంటివి పవన్ లోనూ ఉత్సాహం కలిగించింది.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన చేశారు రాబోయే తెలంగాణ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని సంచలన ప్రకటన చేశారు .అయితే రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసే ఆలోచన లేదని తెలంగాణలో బలమైన 30 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు.కనీసం ఈ 30 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

అయితే పవన్ ప్రకటనపై  తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
   అసలు ఆ పార్టీకి సంస్థాగతంగా నిర్మాణం లేదని, ఏపీ లోని ఆ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉందని,  అసలు ఏమాత్రం బలం లేకుండా తెలంగాణలో పోటీ చేసి పరువు పోగొట్టుకోవడం ఎందుకు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే తెలంగాణలో కొత్తగా అనేక పార్టీలు పుట్టుకొచ్చాయి.ప్రధానంగా కాంగ్రెస్,  బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు అధికారం కోసం పోటీపడుతుండగా.

వైయస్ షర్మిల ఆధ్వర్యంలో కొత్తగా వైయస్సార్ తెలంగాణ పార్టీ ,  అలాగే మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ బి ఎస్ పి తరుపున చురుగ్గా వ్యవహరిస్తున్నారు.ఇంకా అనేక చిన్నా చితకా పార్టీలు తెలంగాణలో ఉన్నాయి.

అయినా తెలంగాణలో పార్టీ తరఫున పెద్దగా కార్యకలాపాలను చోటుచేసుకోకపోయినా పవన్ ఏ ధీమాతో తో తెలంగాణలో పోటీ చేస్తాము అని ప్రకటించారో ఎవరికి అర్థం కావడం లేదు.ఏపీలో జనసేన , బీజేపీ లు పొత్తు పెట్టుకున్నాయి తెలంగాణలోనూ ఈ పొత్తును కొనసాగిస్తాయా లేక బీజేపీని ప్రత్యర్థిగానే తెలంగాణ వరకు జనసేన చూస్తుందా అనే విషయంలోనూ సరైన క్లారిటీ లేదు.

ఇప్పటికే తెలంగాణలో తెలుగుదేశం వైసీపీ వంటి పార్టీలు చేతులెత్తేశాయి.
 

Telugu Chandrababu, Janasenani, Pavan Kalyan, Telangana Bjp, Trs-Politics

 సంస్థాగతంగా ఈ పార్టీలకు తెలంగాణలో నిర్మాణం ఉన్నా… వాటి ఫలితం అంతంత మాత్రమే అని తేలడంతో పెద్దగా కార్యకలాపాలు నిర్వహించడం లేదు.2018 ఎన్నికల్లో వైసిపి స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకోగా కాంగ్రెస్ పార్టీతో టిడిపి పొత్తు పెట్టుకుని కేవలం రెండు స్థానాలను మాత్రమే గెలుచుకుంది.ఇక ప్రస్తుతం ఈ రెండు పార్టీలకు పెద్దగా ఇక్కడ క్యాడర్ కూడా లేదు.

వీటితో పోల్చుకుంటే జనసేన ప్రభావం చాలా తక్కువ.అయినా పవన్ ఏ ధీమా తో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు అనేది ఆ పార్టీ నాయకులకు సైతం అంతుపట్టడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube