గంజాయి సాగుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్!

మన దేశంలో గంజాయి సాగు చేయడం నేరం.గంజాయి ని సాగు చేసినా.

 Government Gives Green Signal To Cannabis Cultivation , Signal , Latest News ,-TeluguStop.com

తరలించినా.విక్రయించినా.

వినియోగించినా.పోలీసులు అరెస్ట్ చేసి.

జైల్లో వేస్తారు.ఎందుకంటే గంజాయి ఒక మాదక ద్రవ్యం.

దాని మత్తులో ఊగుతూ.ఎంతో మంది యువత తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.

అందుకే మన దేశంలో గంజాయి వాడడం నేరం.రెండు తెలుగు రాష్ట్రాల్లో గంజాయి సాగు, రవాణా, వాడకం వంటి కార్యకలాపాల్లో పాల్గొని అనేక మంది యువత పెడదారి పడుతున్నారని మనం రోజూ వార్తల్లో వింటూంటాం.

దొరికిన వారిని పోలీసులు కేసులు పెట్టి జైల్లో వేసిన సందర్భాలు కూడా మన దగ్గర చాలా ఉన్నాయి.కానీ థాయ్‌లాండ్ మాత్రం గంజాయి సాగును ప్రోత్సహిస్తోంది.

ప్రభుత్వమే ఇంటింటికీ గంజాయి మొక్కలను పంపినీ చేస్తోంది.ఇక్కడ గంజాయి సాగను థాయ్ లాండ్ ప్రభుత్వ చట్టబద్ధం చేసింది.

అందువల్ల ఇక నుంచి అన్ని పంటల్లాగే.గంజాయిని కూడా సాగుచేయవచ్చు.

అయితే, ఈ విషయాన్ని అక్కడి ఆరోగ్య శాఖ మంత్రి అనుతిన్‌ చార్న్‌విరాకుల్‌ స్వయంగా వెల్లడించడం విశేషం.అయితే దీనికి కారణం ఉంది.థాయిలాండ్ యొక్క ప్రధాన ఆదాయ వనరు పర్యాటకం.కానీ, కరోనా వల్ల అది చాలా వరకు దెబ్బతింది.

దీంతో ఆదాయం కోసం గంజాయి సాగును ప్రోత్సహించాలని ఆ దేశం నిర్ణయించింది.దీనివల్ల రైతులతో పాటు ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందనే కోణంలో నిబంధనలు మార్చారు.2018 నుంచి థాయ్‌లాండ్‌లో గంజాయి సాగుకు సంబంధించి కొత్త విధానం అమలు చేస్తున్నారు.గంజాయిని ఔషధంగా ఉపయోగించడాన్ని చట్టబద్ధంగా అనుమతించారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో థాయ్‌లాండ్ ప్రభుత్వం దీన్ని మాదక ద్రవ్యాల జాబితా నుంచి కూడా తొలగించింది.అనంతరం గంజాయి సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది.

ఈ కొత్త విధానం ద్వారా ప్రజలకు భారతీయ కరెన్సీలో 10 బిలియన్ భట్ అంటే.రూ.2,245 కోట్ల ఆదాయం వస్తుందని భావిస్తున్నారు.అంతేకాక, ప్రభుత్వమే సుమారు 10 లక్షల మొక్కలను ఇంటింటికీ సరఫరా చేస్తుంది.

వీటిని తమ ఇళ్లలో కానీ, పొలాల్లో కానీ లేదా వాణిజ్యపంటల లాగా కూడా సాగు చేసుకోవచ్చు.దీని వల్ల సుమారు 300 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆ దేశం అంచనా వేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube