ఎంఐఎం బాస్ సవాల్‌ను.. రాహుల్ గాంధీ స్వీకరిస్తారా?

తెలంగాణ టూర్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.టీఆర్ఎస్, బీజేపీ, ఓవైసీలకు ఛాలెంజ్ విసరడానికే తాను రాష్ట్రానికి వచ్చినట్లు తెలిపారు.

 Will Rahul Gandhi Accept Mim Boss Asaduddin Challenge Details, Asaduddin Owaisi-TeluguStop.com

అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎంఐఎం బాస్ అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ తెలంగాణకు ఎవరైనా రావొచ్చని.అయితే రాహుల్ గాంధీకి తెలంగాణ గురించి ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు.

పనిలో పనిగా రాహుల్‌కు ఓ సవాల్ విసిరారు.

రాహుల్ గాంధీకి దమ్ముంటే తెలంగాణ వచ్చి ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని అసదుద్దీన్ ఓవైసీ సవాల్ విసిరారు.

ఎలాగూ కేరళలోని వయనాడ్‌లో రాహుల్ గాంధీ ఓడిపోవడం ఖాయమని.కాబట్టి హైదరాబాద్ లేదంటే మెదక్‌లో పోటీ చేసి రాహుల్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని హితవు పలికారు.ఏ అంశంపై ఏం మాట్లాడాలో కూడా అవగాహన లేని రాహుల్‌.తెలంగాణకు ఏం చేస్తారని, కాంగ్రెస్‌కు ప్రజలు ఎందుకు మద్దతిస్తారని ఓవైసీ ప్రశ్నించారు.

మరి ఎంఐఎం బాస్ విసిరిన సవాల్‌ను రాహుల్ గాంధీ స్వీకరిస్తారా.లేదా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

Telugu Asaduddinrahul, Cm Kcr, Congress, Hyderabad, Rahul Gandhi, Telangana, Way

కాంగ్రెస్ నేతలు కూడా ఈ సవాల్ గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదు.అయితే తెలంగాణ గురించి రాహుల్ గాంధీకి ఏం తెలియదన్న ఓవైసీ.గతంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న విషయాన్ని మరిచిపోయారని సోషల్ మీడియాలో పలువురు సెటైర్లు వేస్తు్న్నారు.ఆనాటి స్నేహం గురించి ఓవైసీ మరిచిపోయారా లేదా ఇప్పుడు కావాలనే రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు.

Telugu Asaduddinrahul, Cm Kcr, Congress, Hyderabad, Rahul Gandhi, Telangana, Way

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతాయో ఎవరికీ తెలియదని.కానీ టీఆర్ఎస్ పార్టీ ఆడిస్తున్నట్లు ఓవైసీ ఆడుతున్నారన్న విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోందని పలువురు విమర్శలు చేస్తున్నారు.రాజకీయ నేతలు ఎదుటివారిపై విమర్శలు చేసేటప్పుడు ఆత్మపరిశీలన చేసుకుని మాట్లాడితే బాగుంటుందని నెటిజన్లు సూచిస్తున్నారు.కేసీఆర్‌కు ఎంత దోస్త్ అయినా పాత దోస్త్‌ను ఉద్దేశిస్తూ ఎద్దేవా చేయడం ఓవైసీకే నష్టం చేకూరుస్తుందని అభిప్రాయపడుతున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube