కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 714 జీవోను రద్దు చేయాలని కోరుతూ ఈ జీవో వలన మోటారు రంగ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని టిఆర్ఎస్ పార్టీ అనుబంధ కార్మిక విభాగం టిఆర్ఎస్ కెవి యూనియన్ నాయకులు మంత్రి పువ్వాడ అజయ్ నీ కలిసి విజ్ఞప్తి చేశారు.ఫిట్నెస్ లేట్ ఫెనల్టి రోజుకు 50 రూపాయలు పడుతుందని, ఈ కరోనా టైంలో ఆర్థికంగా నష్టపోయినా ఆటో కార్మికుల పై పెంచిన పెట్రోల్ , డీజిల్ , గ్యాస్ రేట్లు గుదిబండలా మారాయని , మోటారు రంగ కార్మికుల పై జీఓ 714 వలన వేల రూపాయలు బారం పడుతుందని కావున వెంటనే 714 జీఓను రద్దు చేయాలని కోరుతూ హైదరాబాద్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని మరియు రాష్ట్ర రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.
ఎస్ శ్రీనివాస రాజుని కలిసి వినతి పత్రాన్ని యూనియన్ నాయకులు అందజేశారు .ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కెవి రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ, టీఆర్ఎస్ కెవి – టి.ఏ.టి.యు రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పాల్వంచ కృష్ణ,పాల్గొన్నారు.







