మంగళవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని ఎదిర లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఒకప్పుడు మహబూబ్ నగర్ జిల్లా కరువు కాటకాలతో, తాగునీటికి అల్లాడిపోయిన జిల్లాగా పేరు పొందిందని అలాంటిది యాసంగి లో చిన్న చిన్న గ్రామాలలో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే స్థితికి వచ్చామని, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి కాకముందే ఇలాంటి పరిస్థితి ఉందని, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే జిల్లా ఇంకా సస్యశ్యామలం అవుతుందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గ్రామాలలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, రహదారులు, విద్యుత్తు, తాగునీరు వంటి ఎన్నో సౌకర్యాలను కల్పించామని, పట్టణాల మాదిరిగానే గ్రామాలు కూడా ఎంతో అభివృద్ధి చెందాయని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పి కోనకపోయినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి గింజ కొంటున్నారని చెప్పారు.
త్వరలోనే ఎదిర సమీపంలో ఉన్న ఐ టి కారిడార్లో పెద్ద పెద్ద కంపెనీలు రాబోతున్నాయని, మహబూబ్ నగర్ ను మరింతగా అభివృద్ధి చేస్తామని అన్నారు.మంత్రి వెంట డి సి సి బి ఉపాధ్యక్ష్యులు కొరమోని వెంకటయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ మహమ్మద్ అబ్దుల్ రెహమాన్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.







