యాదాద్రి జిల్లా:ఎక్కడైనా సొంత పార్టీ పాలనపై అసంతృప్తితో రాజీనామా చేసిన ప్రజా ప్రతినిధులను చూస్తాం.కానీ,అధికార పార్టీ పాలన బాగోలేదని ప్రతిపక్ష ప్రజాప్రతినిధి రాజీనామా చేయడం అరుదుగా కనిపించే అంశమే.
ఇదిగో ఇలాంటి సంఘటనే యాదాద్రి జిల్లాలో చోటుచేసుకుంది.భువనగిరి మున్సిపాలిటీలో అధికార టిఆర్ఎస్ పార్టీ అసమర్థ పాలనను నిరసిస్తూ 9వ వార్డు బీజేపీ కౌన్సిలర్ నల్లమాస సుమ వేంకటేశ్వర్లు తన పదవికి రాజీనామా చేశారు.
సోమవారం భువనగిరి మున్సిపల్ కమిషనర్ కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.ప్రస్తుతం ఈ విషయం భువనగిరి పట్టణంలో వైరల్ గా మారింది.







