తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో గురించి మనందరికీ తెలిసిందే.ప్రతి గురు శుక్రవారాలలో ప్రసారం అవుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ను అందిస్తోంది.
అంతేకాకుండా ఈ జబర్దస్త్ కొత్త కొత్త కమెడియన్ లను ఇండస్ట్రీకి పరిచయం చేస్తోంది.ఇక ఈ జబర్దస్త్ షో ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చింది.
ఈ షో ద్వారా ఇప్పటికే పలువురు జంటల మధ్య ఏదో నడుస్తోంది అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.అంతేకాకుండా పలు జంటలు కూడా బాగా వైరల్ అయ్యాయి.
అందులో మొదటి జంట రష్మీ,సుధీర్.వీరిద్దరి ఎవర్ గ్రీన్ జోడిగా చెప్పవచ్చు.
ఆ తరువాత వర్ష, ఇమ్మాన్యుయేల్ జంట కూడా బాగానే ఫేమస్ అయ్యారు.
ఆ తర్వాత నిదానంగా కొద్దిరోజులకి రాకేష్, రోహిణి మధ్య ట్రాక్ నడుస్తుంది అని వార్తలు వినిపించగా ఇక ప్రస్తుతం రాకేశ్, సుజాత మధ్య లవ్ ఉంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.
మరొక జంట ఫైమా,ప్రవీణ్.వీరిద్దరూ ఆన్ స్క్రీన్ లో జోడిగా కనిపించకపోయినా కూడా పటాస్ షో నుంచి వీరిద్దరి మధ్య ఏదో ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ మధ్య కాలంలో కొత్తగా వినిపిస్తున్న మరొక జంట అజర్, రీతూ చౌదరి.ఈ జంట కూడా ఈ మధ్య బాగానే హైలెట్ అవుతోంది.
ఇద్దరూ ఈవెంట్ లు కలిసి చేయడం,షోలలో కలిసి పాల్గొనడం కూడా చేస్తున్నారు.ఇటీవలే సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్న క్యాష్ షో కు కూడా వెళ్లడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం చేకూర్చినట్టు అయింది.

ఇదిలా ఉంటే తాజాగా జబర్దస్త్ ప్రోమో ని విడుదల చేయగా అందులో అజర్ తన టీమ్ లో రీతూ కు ప్రొడక్షన్ అమ్మాయిగా టీ లు అందించే అమ్మాయి క్యారెక్టర్ ఇచ్చాడు.లవర్ గా, భార్య గా మంచి పాత్రలు ఇచ్చేవాడు ఒక్కసారిగా ప్రొడక్షన్ అమ్మాయి గా మార్చడంతో రోజా అసలు విషయం తెలుసుకునేందుకు ప్రయత్నించింది.రీతూ.ఒకసారి టీ.ఒకసారి తుడవమని చెబుతుంటే నీకు కోపం రాదా? అని అందరి ముందే రోజా అడగగా.ఆ విషయం పై స్పందించిన రీతూ సమాధానం చెబుతూ ఎమోషనల్ అవుతు అజర్ అంటే అస్సలు నాకు నచ్చని అబ్బాయి.
కానీ ఆ రెండు నెలల్లో అజర్ ఇచ్చిన సపోర్ట్ వల్లే మళ్లీ నేను ఇక్కడ నవ్వుతున్నాను అని రీతూ చెబుతూ.అజర్‌ను గట్టిగా హత్తుకుంది.దీంతో రోజా ఒక్కసారిగా షాక్ అయ్యింది.ఇక అజర్ కూడా షాక్ అయ్యాడు.







