పవన్ ఫ్యాన్స్ కోసం వీరమల్లు నుండి కీరవాణి క్రేజీ అప్డేట్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.ఆ తర్వాత ఇటీవలే పవన్ భీమ్లా నాయక్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించాడు.

 Mm Keeravani Special Update On Veeramallu Details, Harihara Veeramallu , Mm Keer-TeluguStop.com

ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.ప్రస్తుతం పవన్ వరుస సినిమాలను లైన్లో పెడుతూ స్పీడ్ పెంచేస్తున్నాడు.

ప్రెసెంట్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో ‘హరి హర వీరమల్లు’ సినిమా ఒకటి.ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

ఇప్పటికే ఈ సినిమా 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిన షూటింగ్ ఇటీవలే స్టార్ట్ చేసారు.కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసి శరవేగంగా పూర్తి చేస్తున్నాడు క్రిష్.ఇంకా 40 శాతం షూటింగ్ మిగిలి ఉండడంతో జూన్ లేదా జులై లోపు ఈ సినిమా మొత్తాన్ని పూర్తి చేయాలనీ పవన్ భావిస్తున్నాడు.

అందుకే ఫాస్ట్ గా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు.

పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.

పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి పవన్ ఫ్యాన్స్ కోసం లెజెండరీ డైరెక్టర్ ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చాడు.

Telugu Harihara, Nidhi Aggarwal, Mm Keeravani, Pawan Kalyan, Love-Movie

ఈ సినిమాకు సంగీతం ఎం ఎం కీరవాణి అందిస్తున్నారు.ఈ క్రమంలోనే ఈయన తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసారు.

ఈ పోస్ట్ అభిమానులను మస్త్ ఖుషీ చేస్తుంది.ఈ సినిమాలో ఒక స్పెషల్ లవ్ సాంగ్ ఉందని.దాని కోసం సాహిత్య రచయిత రామ జోగయ్య శాస్త్రి చాలా కష్టపడుతున్నారనే డిటైల్ ఇచ్చాడు.దీంతో పవన్ కళ్యాణ్ హీరోయిన్ నిధి అగర్వాల్ మధ్య ఒక లవ్ సాంగ్ ఉందని అందరు ఫిక్స్ అయ్యారు.

మరి ఈ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube