స్పైడర్ మ్యాన్‌కి పోటీగా స్పైడర్ గర్ల్స్.. ఏం చేస్తారంటే..

బీహార్‌కు చెందిన ‘స్పైడర్ గర్ల్స్‘ ఎటువంటి ఊతం లేకుండా 12 అడుగుల గోడలు ఎక్కే సాహసాలు చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.పాట్నా నివాసి అక్షితా గుప్తా(11) స్పైడర్ మ్యాన్ తరహాలో గోడలు ఎక్కుతుంది.

 Two Daughters Of Bihar Became Spider Girls , Bihar , Spider Girls , Akshita, Kru-TeluguStop.com

అది కూడా ఎలాంటి శిక్షణ లేకుండానే ఎక్కుతుండటం విశేషం.అక్షితతో పాటు ఆమె 9 ఏళ్ల సోదరి కృపిత కూడా దీనిని ప్రాక్టీస్ చేయడం ప్రారంభించింది.

ఈ ఇద్ద‌రు సోదరీమణులు మృదువైన పాలరాతి గోడపైకి కూడా ఎక్కగలరు.మార్బుల్‌తో చేసిన మృదువైన గ్రానైట్ గోడపై ఎటువంటి ఊతం లేకుండా తమ పాదాలతో సులభంగా ఎక్కగలమని అక్షిత, కృపిత తెలిపారు.

వర్చువల్ ప్రదర్శనలో సోదరీమణులు ఇద్దరూ ఎటువంటి మద్దతు లేకుండా 12 అడుగుల స్తంభాన్ని సుల‌భంగా ఎక్కారు.వారు మీడియాతో మాట్లాడుతూ త‌మ‌ తల్లిదండ్రులు బయటకు వెళ్లినప్పుడు, తాము గోడలు ఎక్కేందుకు ప్ర‌య‌త్నించేవార‌మ‌ని తెలిపారు సాధనతో తామ గోడలపై వేగంగా నడవడం చేస్తుంటామ‌న్నారు.

స్పైడర్‌మ్యాన్‌లా గోడలు ఎక్కడం త‌మ‌కు ఎంతో ఆనందంగా ఉంద‌న్నారు.దీనిని చూసి త‌మ‌ అమ్మానాన్నలు షాకయ్యారని తెలాపారు.

ఇది చాలా ప్రమాదకరమని మా అమ్మ త‌మ‌ను వారించినా కొనసాగించామన్నారు.

త్వరలో హిమాలయాల శిఖరాలను అధిరోహించే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాం.

కాగా తన అక్క అక్షితను చూసిన తర్వాతే తాను పిల్లర్ ఎక్కడం నేర్చుకున్నానని కృపిత తెలిపారు.ఏదో ఒకరోజు త‌న కూతుళ్లు హిమాలయ శిఖరాలను అధిరోహించాలని ఆశ‌ప‌డుతున్న‌ట్లు వారి తండ్రి తెలిపారు.

ఈ ఇద్దరు ఆడపిల్లల తండ్రి అజిత్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.త‌న‌ కూతుళ్ల ప్రతిభను చూసి తాను చాలా గర్వపడుతున్నానని, ఏదో ఒక రోజు వారు 12 అడుగులకే పరిమితం కాకుండా హిమాలయ శిఖరాలను అధిరోహిస్తారని ఆశిస్తున్నాన‌న్నారు.

తన కుమార్తెలు కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పుతారని తల్లి ఆశాభావం వ్య‌క్తం చేశారు.ఈ బాలికల తల్లి సంగీతా గుప్తా తన పిల్లల ఘనతను చూసి గర్వప‌డుతున్నాన‌ని తెలిపారు.

గ్రానైట్ గోడ ఎక్కేటప్పుడు వారు పడిపోతానేమోనని అప్పుడప్పుడు భయపడేదానిన‌ని అన్నారు, ఈరోజు త‌న‌ కూతుళ్లను చూసి గర్వపడుతున్నానని తల్లి తెలిపారు.వారు త్వరలో హిమాలయ శిఖరాలను అధిరోహించి కొత్త ప్రపంచ రికార్డులను నెలకొల్పుతార‌ని ఆశిస్తున్నాన‌ని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube