గతంలో మాదిరిగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారనే వార్తలు వచ్చాయి.ఈ వాదనను సీఎం కేసీఆర్ స్వయంగా పలుసార్లు తోసిపుచ్చినప్పటికీ.
దీనిపై ఊహాగానాలు మాత్రం ఆగలేదు.అయితే మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ముందస్తు విషయంలో పునరాలోచనలో పడ్డారని కొందరు భావిస్తుంటే.
అనూహ్య నిర్ణయాలు తీసుకునే కేసీఆర్ ఎప్పుడైనా మళ్లీ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధపడొచ్చని చర్చించుకుంటున్నారు.తెలంగాణలో కొద్దిరోజుల క్రితం వరకు ముందస్తు ఎన్నికలపై జోరుగా చర్చ జరిగింది.
మంత్రి కేటీఆర్.కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.తెలంగాణ గురించి ఆలోచించే నాయకుడు ఒక్క కేసీఆర్ మాత్రమే అని వ్యాఖ్యానించారు.ఇదే సమయంలో తెలంగాణలో మరో ఏడాది, రెండేళ్లపాటు ఎలాంటి ఎన్నికలు ఉండబోవంటూ కేటీఆర్ కామెంట్ చేశారు.
షెడ్యూల్ ప్రకారం తెలంగాణకు వచ్చే ఏడాది డిసెంబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది.అయితే కేసీఆర్ అంతకంటే ముందే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు ముందస్తు ఎన్నికలకు వెళతారని ఊహాగానాలు వస్తున్నాయి.

ఇటీవల మాజీ టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు.అయితే కేటీఆర్ మాత్రం రాబోయే ఏడాది, రెండేళ్లపాటు తెలంగాణలో ఎలాంటి ఎన్నికలు ఉండబోవంటూ ముందస్తు ఎన్నికలకు టీఆర్ఎస్ వెళ్లే అవకాశం లేదని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.నిజానికి తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయా ? లేదా ? అనే అంశంపై టీఆర్ఎస్ నేతల్లో కూడా పెద్దగా క్లారిటీ లేదు.ఈ క్రమంలోనే కేసీఆర్ కుమారుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణలో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ఆ పార్టీ నేతలు కూడా భావిస్తున్నారు.

అయితే టీఆర్ఎస్ వర్గాల్లో మాత్రం ఎప్పటికప్పుడు సర్వేలకు సంబంధించిన వార్తలను ఎమ్మెల్యేలను, పార్టీ ముఖ్యనేతలను కలవరపెడుతున్నాయి.ఎన్నికలు ఎప్పుడు జరిగినా.గతంలో మాదిరిగా ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో మెజార్టీ నేతలకు మళ్లీ టికెట్లు ఇచ్చే అవకాశం ఉండదని.ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉందని సర్వేల్లో తేలితే.ఆ నేతలను పక్కనపెట్టాలని గులాబీ బాస్ కేసీఆర్ డిసైడయ్యారని పలువురు చర్చించుకుంటున్నారు.ఏదేమైనా.
ఇప్పుడప్పుడే తెలంగాణలో ఎన్నికలు లేవని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో టీఆర్ఎస్ నేతలకు ఊరట కలిగిస్తున్నాయి.