సాంప్రదాయ వ్యవసాయంతో సంతృప్తి చెందని రైతులు పొద్దుతిరుగుడు సాగు దిశగా ఆలోచిస్తున్నారు.గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన రామ్‌వారు పొద్దుతిరుగుడు సాగు ప్రారంభించాడు.10 వేల రూపాయలతో సాగు ప్రారంభించి మొదటి ఏడాదిలోనే 6 లక్షల రూపాయల లాభం పొందాడు.రామ్ ఇప్పుడు పొద్దుతిరుగుడు పూల పెంపకం పట్ల చాలా సంతృప్తితో ఉన్నాడు.
రైతులు పొద్దుతిరుగుడు సాగు దిశగా ఆలోచించాలని సలహా ఇస్తున్నాడు.రైతులకు సంప్రదాయ వ్యవసాయంలో లాభాలు రావడంలేదని, పైగా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడని రామ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక్కడ చాలామంది సంప్రదాయ వ్యవసాయం చేస్తున్నారు.
కానీ వాతావరణం కారణంగా ఏటా ఎన్నో కష్టాలు పడాల్సి వస్తోంది.
కొన్నేళ్లుగా ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచనలో ఉన్నాను.నా దగ్గర అంత డబ్బు కూడా లేదు.
ఆ సమయంలో పూల సాగు చేసే కొంతమంది రైతులను కలిశాను.వారి సూచన మేరకు పొద్దుతిరుగుడు పూల సాగు ప్రారంభించాను.
నాకున్న భూమిలో జొన్న-గోధుమ మొదలైన వాటికి బదులుగా పొద్దుతిరుగుడు సాగు చేయడం ప్రారంభించాను.దీనిని చూసిన చుట్టుపక్కలవారు ఆశ్చర్యపోయారు.అయితే నేను ఇప్పటికే దాదాపు రూ.6 లక్షలు సంపాదించినప్పుడు, ఈ సాగు ప్రాముఖ్యతను చుట్టుపక్కలవారు తెలుసుకున్నారు.ఇప్పుడు పొద్దుతిరుగుడుకు మంచి మార్కెట్ ఉందన్నారు.







