మెగా ప్రిన్స్ కోసం చిరంజీవి..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ గని బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంతో రాగా సినిమా కోసం వరుణ్ తేజ్ బాగా కష్టపడినా ఫలితం మాత్రం తీవ్రంగా నిరాశపరచింది.

 Chiranjeevi Support For Mega Prince Varun Tej Details, Acharya, Chiranjeevi, Gha-TeluguStop.com

ఈ క్రమంలో గని సినిమా తర్వాత వరుణ్ తేజ్ చేస్తున్న సినిమాల పైన మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తుంది.ఈ సందర్భంగా వరుణ్ తేజ్ కోసం ఓ మంచి మాస్ కథ సెర్చ్ చేస్తున్నారట.

మెగా ఫ్యాన్స్ ని అలరించే మాస్ కథ తో వరుణ్ తేజ్ సినిమా తీస్తే రిజల్ట్ అదిరిపోతుందని మెగాస్టార్ భావిస్తున్నారు.

అంతేకాదు ఒకటి రెండు హిట్లు పడే వరకు స్టోరీ డిస్కషన్స్ లో తాను కూడా పాల్గొంటానని హామీ ఇచ్చారట.

సో ఇక నుండి వరుణ్ తేజ్ చేసే సినిమాలకు మెగా సపోర్ట్ ఫుల్ గా ఉండనుందని చెప్పొచ్చు.ఇప్పటికే వరుణ్ తేజ్ దగ్గరకు ఒకటి రెండు కథలు వచ్చాయట.

వాటిని చిరంజీవి విని ఫైనల్ చేస్తారని తెలుస్తుంది.ప్రస్తుతం వరుణ్ తేజ్ ఎఫ్ 3 సినిమా చేస్తున్నారు.

ఆ సినిమా తర్వాత మరో మాస్ కథతో రావాలని చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube