నెల్లూరు: కోర్ట్ లో దొంగతనం కేసులో పురోగతి.ఇద్దరు నింధితులని అరెస్ట్ చేసిన పోలీసులు.
సీసీ ఫుటేజ్ ఆధారంగా నింధితులని గుర్తించిన పోలీసులు.మీడియా ఎదుట నిందితులను హాజరు పరిచిన పోలీసులు.
జిల్లా ఎస్పీ విజయారావు కామెంట్స్… 2016 లో 521 క్రైమ్ నంబర్ కి సంబంధించిన కేసులో బ్యాగ్ పోయిందని కంప్లైంట్ వచ్చింది.కోర్టులో బ్యాగ్ దొంగతనం చేసాక వాటిలో సెల్ ఫోన్లు, లాప్ టాప్ తీసుకెళ్లారు.బాగ్, అందులోని కాగితాలు అక్కడే పడేసారు.24 గంటల్లో వేగంగా విచారణ చేసి ఇద్దరు వ్యక్తులను గుర్తించాం.14 పాత కేసుల్లో ఏ1 ముద్దాయిలుగా ఈ ఇద్దరు ఉన్నారు.ఒక లాప్ టాబ్, ఒక టాబ్, 4 సెల్ ఫోన్లు, 7 సిమ్ కార్డులను రికవరీ చేశాము.
కుద్దూస్ నగర్ కి చెందిన సయ్యద్ హయత్ ఏ1, పొర్లుకట్టకి చెందిన రసూల్ లని అరెస్ట్ చేసాం.ఐరన్ స్క్రాబ్ ని దొంగతనం చేయాలని వెళ్తే అక్కడ కుక్కలు అరిచాయి.
దీంతో పక్కనే ఉన్న కోర్టులోకి ప్రవేశించి అక్కడ తలుపు పగులకొట్టి బ్యాగ్ తీసుకెళ్లారు.బ్యాగ్ తో బయటకి వచ్చిన తర్వాత పేపర్లు అక్కడ పడేసి ఎలక్ట్రానిక్ వస్తువులు చోరీ చేశారు.
పక్కా ఆధారాలతో మేము నింధితులని అరెస్ట్ చేసాము.పొలిటికల్ రూమర్స్ గురించి మేము మాట్లాడము, ఆధారాలతో మాత్రమే మాట్లాడుతాం.







