జయమ్మ పంచాయితీ' ట్రైలర్, మే 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సినిమా గ్రాండ్ రిలీజ్

పాపులర్ యాంకర్, టెలివిజన్ వ్యాఖ్యాత, హోస్ట్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన ‘జయమ్మ పంచాయితీ’ విడుదలకు సిద్ధమైయింది.ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా జరుపుకుంటున్న ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేశారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదగా ఈ ట్రైలర్ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.2 నిమిషాల 15 సెకండ్ల నిడివి గల ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఆకట్టుకుంది.తనకు వచ్చిన సమస్య పై జయమ్మ పంచాయితీ పెట్టడం, గ్రామ పెద్దలు జయమ్మ సమస్యని తేలికగా తీసుకోవడం, జయమ్మ ఎదురు తిరగడం.ఇలా కథ, సినిమా పై ఆసక్తిని పెంచేలా ట్రైలర్ వుంది.ఉత్తరాంధ్ర మాండలికంలో సాగిన సంభాషణలు ఆసక్తికరంగా వున్నాయి.‘ఎవరు వల్ల సెడ్డావురా వీరన్న అంటే నోటి వల్ల సెడ్డానురా కాటమరాజా’ అని జయమ్మ పలికిన డైలాగ్ నవ్వులు పూయించింది.ట్రైలర్ లో వినిపించిన డైలాగ్స్ ని నటులంతా ఉత్తరాంధ్ర మాండలికంలో చక్కగా పలికారు.

 Jayamma Panchayati 'trailer, The Grand Release Of The Movie On May 6 In Theaters-TeluguStop.com

జయమ్మపాత్రలో సుమ కనిపించిన తీరు అద్భుతంగా వుండటంతో పాటు సహజంగా, ప్రేక్షకులు చాలా సులువుగా ఆ పాత్రని కనెక్ట్ చేసుకునేలా వుంది.

దర్శకుడు ఒక వైవిధ్యమైన కథని ఈ చిత్రంతో ప్రేక్షకులకు చూపించబోతున్నారనే విషయం ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది.ఎంఎం కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది.వెన్నెల క్రియేషన్స్‌ పతాకంపై బలగ ప్రకాష్‌ నిర్మిస్తున్న ‘జయమ్మ పంచాయితీ’ మే 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube