యూట్యూబ్ క్రియేటర్లు! ఇక పండగ చేసుకోండి.. షార్ట్స్ కోసం యూట్యూబ్ వీడియోలను వాడుకోవచ్చట?

జనులకు YouTube పరిచయం అక్కర్లేదు.ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ వీడియో ప్లాట్‌ఫామ్‌ ఏదన్న వుంది అంటే అది YouTube మాత్రమే.

 Now Youtube Creators Can Use Youtube Videos For Creating Shorts Details, Youtub-TeluguStop.com

ట్రెండ్ కి తగినట్లు మార్పు చెందటం YouTubeకే చెల్లింది.ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది క్రియేటర్స్ ఈ ప్లాట్‌ఫామ్‌ ని వాడుకొని బయటకు వస్తున్నారు.

ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం టిక్‌టాక్‌ ని పోలినటువంటి యూట్యూబ్ షార్ట్స్ తీసుకొచ్చింది.ఈ ప్లాట్‌ఫామ్‌ వచ్చాక షార్ట్ వీడియోలు క్రియేట్ చేసే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది అనడంలో అతిశయోక్తి లేదు.

వీటి సహాయంతో క్రియేటర్లు మరింత మందికి చేరువ అవుతున్నారు.

ఇక తాజాగా షార్ట్ వీడియో క్రియేటర్ల కోసం యూట్యూబ్ ఒక అదిరిపోయే ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ ఫీచర్‌తో క్రియేటర్లు తమ షార్ట్స్ కోసం యూట్యూబ్ వీడియోల నుంచి వీడియో క్లిప్‌లను కట్ చేసుకోవచ్చు.ఈ విషయాన్ని యూట్యూబ్ తాజాగా ఒక బ్లాగ్ ద్వారా ప్రకటించింది.

అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్ IOS యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తెస్తోంది.ఈ ఏడాది చివరి నాటికి ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులో వుండేటట్టు ప్రణాళికలు రచిస్తోంది.

యూట్యూబ్ షార్ట్స్ ఉపయోగించి 60-సెకన్ల వ్యవధి గల వీడియోలు క్రియేట్ చేయొచ్చు.

Telugu Creators, Latest, Youtube-Latest News - Telugu

అయితే ఇప్పుడు క్రియేటర్లు తమ షార్ట్-ఫామ్ వీడియోల కోసం లాంగ్-ఫామ్, షార్ట్ వీడియోల నుంచి సుమారు 1 నుంచి 5 సెకన్ల క్లిప్‌లను తేలికగా వాడుకోవచ్చు.క్రియేటర్లు మరొక వీడియో నుంచి క్లిప్‌ను ఉపయోగించి షార్ట్‌ను క్రియేట్ చేసినప్పుడు, అసలు వీడియోకి లింక్ ద్వారా క్రెడిట్ ఇవ్వడం జరుగుతుంది.క్రియేటర్లు తమ లాంగ్ వీడియోలను ఇతరులు ఎక్కువగా యూజ్ లేకుండా ఒక లిమిట్ పెట్టొచ్చు.

ప్రైవేటు లేదా కాపీరైట్లు ఉన్న వీడియోలలోని క్లిప్స్ వాడటం కుదరదు.ఓన్లీ ఎలిజిబుల్ వీడియోల నుంచి మాత్రమే క్రియేటర్లు క్లిప్స్ కట్ చేయడం కుదురుతుంది.

యూట్యూబ్ షార్ట్‌లలోని ఈ కొత్త ఫీచర్… రీల్స్ కోసం ఇన్‌స్టాగ్రామ్ రీమిక్స్ ఫీచర్ పని చేసినట్లుగా పనిచేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube