కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమాకు భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల నుంచి పాజిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.ప్రశాంత్ నీల్ తన దర్శకత్వ ప్రతిభతో మ్యాజిక్ చేశారని చెప్పాలి.
అయితే కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమాలో కొన్ని తప్పులు చేయకుండా ఉండి ఉంటే మాత్రం ఈ సినిమా మరింత పెద్ద హిట్టై ఉండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ సినిమాకు ముఖ్యంగా ఫస్టాఫ్ మైనస్ గా ఉంది.
సెకండాఫ్ లో అద్భుతమైన సీన్లను రాసుకున్న ప్రశాంత్ నీల్ ఫస్టాఫ్ విషయంలో తడబడ్డారు.
మరోవైపు ఈ సినిమాను చూసిన ప్రేక్షకులలో చాలామంది కథనంలో కొంతమేర గందరగోళం ఉందని కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు అనంత్ నాగ్ పాత్రను ప్రకాష్ రాజ్ తో రీప్లేస్ చేసినా ఆ పాత్రకు అనంత్ నాగ్ పర్ఫెక్ట్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు సినిమాలో పాటలు అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునేలా అయితే లేవు.
ప్రశాంత్ నీల్ ఈ విషయంలో మరింత జాగ్రత్త పడి ఉంటే బాగుండేది.

అయితే ఈ సినిమాలోని ప్లస్ పాయింట్లు సినిమాలోని మైనస్ లను కవర్ చేశాయి.అయితే ఈ తప్పులు చేయకపోయి ఉంటే మాత్రమే కేజీఎఫ్2 మరింత పెద్ద హిట్ అయ్యేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మాస్ ప్రేక్షకులకు పైసా వసూల్ అనిపించే విధంగా కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమా ఉంది.ఈ సినిమాపై భారీ మొత్తం ఇన్వెస్ట్ చేసిన డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.కేజీఎఫ్2 ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్లను అందుకుంటుందో చూడాల్సి ఉంది.కేజీఎఫ్2 క్లైమాక్స్ ను ప్రేక్షకుల ఊహలకు భిన్నంగా దర్శకుడు ముగించినా తన క్లైమాక్స్ ద్వారా ఈ దర్శకుడు ప్రేక్షకులను మెప్పించారు.ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ కు మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుందేమో చూడాలి.







