మా డబ్బులు ఇప్పించండి:- అధికారులకు బాధితులు విజ్ఞప్తి

ఖమ్మం రూరల్ మండలం గుదిమళ్ళ గ్రామానికి చెందిన పేరం శ్రీనివాస్ రావు, పేరం వెంకయ్య, పేరం చినవెంకటయ్య అను మా వద్ద ఎస్ ఎ పాషా 49.50 లక్షలు డబ్బు వడ్డీ నిమిత్తం తీసుకొని మోసం చేశాడని శుక్రవారం ఖమ్మం నగరం లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ఆరోపించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం రూరల్ మండలం లోని మహ్మదీయ కాలేజ్ వ్యవస్థాపకుడు పాష అను వ్యక్తి 2011-12 ఆయన ఆర్థిక పరిస్థితులు బాగోలేదని, కాలేజ్ మూసివేసే పరిస్థితి వచ్చిందని ముసలి కన్నీరు కారుస్తు తమ వద్ద నలభై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు వడ్డీకి తీసుకొని ఇప్పటివరకు ఎలాంటి వడ్డీ చెల్లించకుండా , అసలు చెల్లించకుండా మమ్మల్నీ మోసం చేశాడని వాపోయారు.ఇట్టి విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన పాషా తన పలుకుబడితో మాపై అక్రమ కేసుపెట్టించి (సీసి 98/2021) మమ్మల్నీ మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తునడన్నారు .ఎన్ని సార్లు అడిగినా, పెద్దమనుషుల మధ్య ఎన్ని పంచాయతీలు చేసిన ఇప్పటి వరకు రేపు మాపు అంటూ తప్పించుకుంటూ తిరుగుతున్నాడు .కావున సామాన్య రైతులైన మాపై దయవుంచి అధికారులు ఇకనైనా స్పందించి మాకు న్యాయం చేసి మా డబ్బును మాకు ఇప్పించగలరని కోరుతున్నాము.

 Give Our Money: - Victims Appeal To Authorities-TeluguStop.com
Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube