వరద సాయంలోనూ తెలంగాణపై బీజేపీ ప్రభుత్వం వివక్ష:- మంత్రి పువ్వాడ ట్విట్

2020 లో భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్‌ ప్రజలకు సాయం అందించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా వివక్ష చూపుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అగ్రహం వ్యక్తం చేశారు, తెలంగాణపై బీజేపీ ప్రభుత్వ పక్షపాత వైఖరిని ట్విట్టర్ వేదికగా మంత్రి పువ్వాడ ఎండగట్టారు.2021-22 లో వివిధ రాష్ట్రాలకు అందించిన జాతీయ విపత్తుల ఉపశమన నిధుల వివరాలను కేంద్రం తాజాగా విడుదల చేసింది.కేంద్ర నివేదికను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన మంత్రి పువ్వాడ, ఆ నివేదికలో తెలంగాణ రాష్ట్రం పేరు లేకపోవడాన్ని ప్రస్తావించారు.వరదల సమయంలో సీఎం కేసీఆర్ గారు బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉన్నారని, కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ ఆదుకోలేదని పేర్కొన్నారు.

 Bjp Government Discriminates Against Telangana Even During Floods: - Minister Pu-TeluguStop.com

ప్రతి అంశంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై చూపుతున్న వివక్షపూరిత వైఖరితో మనసు కలచి చేస్తోందని మంత్రి పువ్వాడ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.2021-22 లో అనేక రాష్ట్రాలను ఎన్డీఆర్ఎఫ్ నిధులు మంజూరు చేసిన కేంద్రం, తెలంగాణ కు మాత్రం ఒక్క పైసా కూడా విడుదల చేయలేదన్నారు.తెలంగాణ ప్రభుత్వం వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేసి ఆదుకొన్నదన్నారు.వరద బీభత్సంతో అల్లాడిపోయిన తెలంగాణకు రూ.1,350 కోట్ల తక్షణ సాయం, మొత్తం రూ.5 వేల కోట్ల ఎన్డీఆర్‌ఎఫ్‌ నిధులివ్వాలని సీఎం కేసీఆర్‌ గారు ప్రధానమంత్రికి గతంలోనే లేఖ రాసిన విషయం గుర్తుచేశారు.కానీ ఇప్పటిదాకా కేంద్రం నుంచి నయాపైసా రాలేదని అన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube