హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రూల్స్ బ్రేక్ చేసే వారిపై సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరి పై ఉక్కుపాదం మోపుతున్నారు.ట్రాఫిక్ రూల్స్ ని ఎవర్ని అతిక్రమించిన కూడా వారికి ఫైన్ తప్పకుండా ఉంటుంది అని హెచ్చరిస్తున్నారు.
ఇటీవలే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మంచు విష్ణు, కళ్యాణ్ రామ్ లాంటి సెలబ్రిటీల కారు లు ఆపి చలాన విధించిన విషయం తెలిసిందే.తాజాగా ఆ లిస్ట్ లోకి టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చేరారు.
హైదరాబాద్ లోని ట్రాఫిక్ పోలీసులు గత కొద్ది రోజులుగా నగరంలోని పలుచోట్ల స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఇటీవల మంచు విష్ణు కారు ఆపి బ్లాక్ ఫిలిం ను తొలగించి అనంతరం చలానా విధించారు.
ఈ క్రమంలోనే తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కారుని ఆపిన ట్రాఫిక్ పోలీసులు త్రివిక్రమ్ కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలిం ను తొలగించారు.గత కొద్దిరోజులుగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే కారు అద్దాలకు నల్ల ఫిలిం వాడకూడదు అని కూడా చెబుతున్నారు.ఒకవేళ బ్లాక్ ఫిలిం అద్దాలు వాడితే 70 శాతం వెలుతురు లోపలికి వచ్చే విధంగా ఉండాలి.

అలాంటి అబద్దాలను మాత్రమే వినియోగించాలి అని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.ఈ విషయంలో ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా తప్పకుండా వెంటనే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.ఇక దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయానికి వస్తే.త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చివరగా అలా వైకుంఠపురం లో సినిమా వచ్చింది.ఆ సినిమా తరువాత కరోనా మహమ్మారి వల్ల త్రివిక్రం అనుకుంటున్నా ప్రాజెక్టులకు ఏదోవిధంగా అడ్డు పడుతూనే ఉన్నాయి.ఇలా ఉంటే మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా రాబోతోంది అని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
కానీ ఈ విషయంపై త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.







