ఇటీవలి కాలంలో అప్పు ఇచ్చిన తర్వాత మళ్లీ తిరిగి ఇచ్చేవారే కరువయ్యారు.డబ్బు చేసుకునేటప్పుడు ప్రేమగా మాట్లాడటం మళ్ళీ తిరిగి ఇవ్వాలి అని అప్పుడు ఏదో శత్రువుల చూడటం చేస్తూ ఉన్నారు.
అందుకే నేటి రోజుల్లో ఎవరికైనా తెలిసిన వాళ్ళకి అప్పు ఇవ్వడానికి కూడా భయపడి పోతున్నారు జనాలు.ఇక మరికొంతమంది మాత్రం తెలిసిన వాళ్లే కదా అని అప్పు ఇచ్చి చివరికి మోసపోతున్న ఘటనలో వస్తున్నాయి.
చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయిస్తున్నారు.కేవలం సామాన్యుడు మాత్రమే కాదు సినీ సెలబ్రిటీలకు కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి.
ఇక అచ్చం ఇలాగే మోసపోయింది హీరోయిన్ రీమీ సేన్. ఈ అమ్మడి గురించి ఎవరికీ తెలియకపోవచ్చు కానీ మెగాస్టార్ హీరోగా నటించిన అందరివాడు సినిమాలో చిరంజీవి సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ.
అయితే ఈ అమ్మడు ఏకంగా సన్నిహితులు అనుకున్న వారికే డబ్బులు ఇచ్చి చివరికి మోసపోయిందట.ఇక దీంతో ఎన్నో రోజుల పాటు బాధ పడిందట.ఇక ఆ తర్వాత ఎవరికీ డబ్బులు సహాయం చేయకూడదని డిసైడ్ అయిపోయిందట ఈ ముద్దుగుమ్మ.రిమ్మీ సేన్ కు మూడేళ్లక్రితం వ్యాపారవేత్త రౌనాక్ జతిన్ వ్యాస్ అనే వ్యక్తి జిమ్ లో పరిచయం అయ్యాడు.

వీరి పరిచయం కాస్త మంచి స్నేహం గా మారిపోయింది.ఏకంగా సదరు వ్యక్తి డబ్బు అడగ్గానే వెంటనే వెనకా ముందు ఆలోచించకుండా డబ్బు ఇచ్చేంతగా వీరి ఫ్రెండ్షిప్ క్లోజ్ అయింది.కొత్త వెంచర్ స్టార్ట్ చేస్తున్నామని ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభాలు వస్తాయి అంటూ అతను నమ్మించాడు.ఇక మాయ మాటలు నమ్మి దాచుకున్న 4.14 కోట్ల డబ్బు మొత్తాన్ని వసూలు పెట్టుబడిగా పెట్టడానికి ఇచ్చేసింది ఈ ముద్దుగుమ్మ.కొన్ని రోజుల తర్వాత సదరు వ్యక్తి కనిపించడం మానేసాడు.
డౌట్ వచ్చి ఆరా తీయగా గా ఇక మోసపోయానని గ్రహించిన అతను ఏ వ్యాపారం ప్రారంభించ లేదని తాను ఇచ్చిన డబ్బులతో ఉడాయించాడు అన్న విషయం తెలిసి పోలీసులను ఆశ్రయించింది.







