ఆస్ట్రేలియాను మళ్లీ ముంచెత్తిన వరదలు.. సాయం కోసం ప్రజల ఎదురుచూపులు

ఆస్ట్రేలియాపై ప్రకృతి పగబట్టినట్లుగా కనిపిస్తోంది.గత ఫిబ్రవరిలో సంభవించిన వరదల కారణంగా వేలాది మంది నిరాశ్రయులవ్వగా.

 Severe Flooding Strikes Australian East Coast Again, Australian, State Of New S-TeluguStop.com

కోట్లాది రూపాయల ఆస్తినష్టం సంభవించింది.దీని నుంచి కోలుకోకముందే మరోసారి ఆస్ట్రేలియాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

గత వరదలతో దెబ్బతిన్న న్యూసౌత్ వేల్స్ రాష్ట్రంలో పునర్నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్న వేళ.మరోసారి భారీ వర్షాలు , వరదలు పోటెత్తడంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

బుధ, గురువారాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా లిస్మోర్‌లో ఉత్తరాది నదులు పోటెత్తాయి.వీధులు, ఇళ్లలోకి నీరు రావడంతో ప్రజలు ఇంటి మిద్దెలు, పైకప్పులకెక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

గడిచిన 24 గంటల్లో స్టేట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ (ఎస్ఈఎస్), రెస్క్యూ సర్వీస్‌కు లిస్మోర్‌లోని బాధితుల నుంచి భారీగా కాల్స్ వస్తున్నాయి.

దాదాపు 30,000 మందిని ప్రభావితం చేసే 20 తరలింపు ఆదేశాలు ఇప్పటికీ అమల్లో వున్నాయి.

అయితే వరద తగ్గుముఖం పట్టిందని బ్యూరో ఆఫ్ మెటియోరాలజీ అధికారులు అన్నారు.లిస్మోర్ మీదుగా ప్రవహించే విల్సన్స్ నది కారణంగా నగరం తీవ్రంగా ప్రభావితమైందని చెప్పారు.

ప్రస్తుతం నీటిమట్టం 12 మీటర్లకు దిగువనే వున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Telugu Australian, Lismore, Wales-Telugu NRI

అత్యంత తీవ్రమైన బుష్‌ఫైర్లు సంభవించిన రెండేళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో భారీ జనసాంద్రత వున్న తూర్పు తీరం.ప్రస్తుతం రికార్డు స్థాయిలో వరదలతో పోరాడుతోంది.ఎల్ నినో కారణంగా అసాధారణ వర్షపాతం సంభవిస్తోందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు ఇప్పటి వరకు అందుతోన్న సమాచారం ప్రకారం.వరదల కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించినట్లుగా తెలుస్తోంది.

అయితే లిస్మోర్ వద్ద వరద నీటిలో గల్లంతైన మహిళ కోసం రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

ఇకపోతే.

ఆస్ట్రేలియాలో వరదల కారణంగా గత నెలలలో ఇద్దరు భారత సంతతి తల్లీ, కుమారుడు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.వెంట్‌వర్త్‌విల్లేలో హేమలతా సోల్హైర్ సచ్చితనాంతం, బ్రమూత్ మృతదేహాలను కనుగొన్నారు.

కనిపించకుండా పోయిన వారు మజ్డా 3 మురికినీటి కాలువలో శవాలుగా తేలారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube