రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా మార్చి 5వ తేదీ విడుదల అయ్యి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం కలెక్షన్లు తగ్గకుండా దూసుకుపోతుంది.
ఇక ఈ సినిమా పై టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో చెప్పిన విధంగా అభిమానుల కోసం ఆర్ఆర్ఆర్ దుస్తులను అందుబాటులోకి తీసుకొచ్చారు.‘ఆర్ఆర్ఆర్‘ లోగోతో ఉన్న దుస్తులను అభిమానుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించి అభిమానుల అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ఎన్టీఆర్ ఒక నోట్ రూపంలో ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు.
ఈ దుస్తులు మా అద్భుతమైన అభిమానుల కోసం.ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉందో మీరు కూడా ఈ దుస్తులను ధరించి అంతే ఆనందం వ్యక్తం చేస్తూ మమ్మల్ని సంతోష పెడతారని భావిస్తున్నాము.
ప్రస్తుతం సినిమా లోగో కలిగిన ఈ దుస్తులు ది సోల్డ్ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయని ఎన్టీఆర్ ఇంస్టాగ్రామ్ పోస్టు ద్వారా తెలియజేశారు.

ఇందులో షర్ట్స్ టీ షర్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.కేవలం అభిమానులకు దుస్తులు మాత్రమే కాకుండా గిఫ్ట్స్ కూడా ఇవ్వనున్నారు.ఈ దుస్తులను కొనుగోలు చేసిన అభిమానులలో ఐదుగురికి అద్భుతమైన బహుమతులు కలిగిన ఓచర్ లను కూడా అంద చేస్తామని ఈ సందర్భంగా ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.
ఈ విధంగా ఎన్టీఆర్, మెగా అభిమానుల కోసం ప్రత్యేకంగా ఇలాంటి దుస్తులను తయారు చేయించి అభిమానులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.







