టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం అందరికి తెలిసిందే.
ఇటీవలే నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే.ఏడాది గ్యాప్ లోనే రెండు సినిమాలతో మంచి హిట్ అందుకున్నాడు.
ఇక విడాకుల తర్వాత నాగచైతన్య సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ సినిమాలకు సంబంధించిన విషయాల గురించి అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.
అయితే విడాకులకు ఎప్పుడు సోషల్ మీడియాలో కనిపించని నాగ చైతన్య విడాకుల తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్గా గా ఉంటున్నాడు.
నాగ చైతన్య నటించిన థాంక్యూ, బాలీవుడ్ ఫస్ట్ మూవీ అయినా లాల్ సింగ్ చద్దా సినిమాలువిడుదలకు సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా నాగచైతన్య కు సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
నాగచైతన్య తన తదుపరి సినిమాను సమంత బెస్ట్ ఫ్రెండ్, టాలీవుడ్ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి తో కలిసి సినిమాను చేయబోతున్నారట.

వై జయంతీ మూవీస్ పతాకంపై స్వప్న దత్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు.అయితే గతంలో నందినీరెడ్డి ఈ సినిమాను సమంత నాగ చైతన్య లతో తీయాలని ప్లాన్ చేసింది.కానీ సమంత నాగచైతన్య విడాకుల వ్యవహారంతో నందిని రెడ్డి ప్లాన్ కు బ్రేకులు పడ్డాయి.
అయితే ఈ ప్రాజెక్టుకు నాగచైతన్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.నాగ చైతన్య ప్రస్తుతం వెంకట్ ప్రభు తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.సినిమా అనంతరం ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందట.ఒకవేళ ఇదే మాట కనుక నిజం అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.







