ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది.ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తున్నా.
సొంత దేశంలో నిరసనలు వెల్లువెత్తుతున్నా రష్యా అధినేత పుతిన్ ఏ మాత్రం తగ్గడం లేదు.ఉక్రెయిన్ ఆక్రమణే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
దీంతో ఆ దేశం స్మశానాన్ని తలపిస్తోంది.యుద్ధం కారణంగా ఇరువైపులా ఎంతో ప్రాణ నష్టం సంభవిస్తోంది.
ఇక మేరియుపోల్ నగరాన్ని రష్యా నేలమట్టం చేసేసింది.ఈ నగరాన్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ స్వాధీనం చేసుకోవడం పుతిన్‌కు అత్యంత కీలకం.
ఉక్రెయిన్‌కు అజోవ్ సముద్రంతో సంబంధాలు తెంచడంతో పాటు క్రిమియా- డాన్‌బాస్- రష్యా మధ్య భూకారిడార్ ఏర్పాటు చేయాలన్నది రష్యా ఆలోచన.దీంతో మేరియుపోల్ నగరంపై క్షిపణులు, శతఘ్నలతో విరుచుకుపడుతోంది.
యుద్ధం కారణంగా లక్షలది మంది ఉక్రెయిన్ వాసులు ఐరోపా దేశాలకు వలస పోతున్నారు.
ఈ నేపథ్యంలో సిక్కు ధర్మ ఇంటర్నేషనల్, యునైటెడ్ సిక్స్, సిక్కు డిఫెన్స్ నెట్‌వర్క్ సభ్యులు ఉక్రేనియన్ల సాయంతో సిక్కు మత పవిత్ర గ్రంథాలను ఇంగ్లాండ్‌కు తీసుకెళ్లారు.
సిక్కు ‘Rehat Maryada’ ప్రకారం.ఈ గ్రంథాలను ఇంగ్లాండ్‌లోని డెర్బీ నేషనల్ సిక్కు మ్యూజియంలో ఉంచారు.సిక్కు ధర్మ ఇంటర్నేషనల్ ప్రతినిధి సిమ్రాన్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ… రష్యా దళాల నుంచి తీవ్ర దాడికి గురైన పోర్ట్ సిటీ ఒడెస్సాలో వున్న గురుద్వారాలోని సిక్కు పవిత్ర గ్రంథాలు సురక్షితంగా లేవు.ఈ విషయాన్ని ఉక్రెయిన్‌లోని పరిచయస్తుల నుంచి తెలుసుకున్నామని సిమ్రాన్ సింగ్ తెలిపారు.
అందువల్ల గురుద్వారా నుంచి మతపరమైన సాహిత్యాన్ని క్షేమంగా తీసుకొచ్చేందుకు సిక్కు సంస్థల ప్రతినిధులు సంయుక్తంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు.గ్రంథాలలో హిందీ, గురుముఖిలో ప్రచురించిన సెంచిస్ సెట్లు, గుర్బానీ ఇతర మతపరమైన సాహిత్యానికి చెందిన 30కి పైగా గుట్కాలు వున్నాయి.

తొలుత రొమేనియా చేరుకున్న సిమ్రాన్, అతని బృందంలోని సభ్యులు ఉక్రెయిన్ చేరుకోవడం అంత సులభం కాదు.దీంతో వారు అక్కడి నుంచి మోల్డోవాకు వెళ్లారు.ఒడెస్సాలోని కొందరు ఉక్రెనియన్ల సాయంతో మత గ్రంథాలను రక్షించారు.వీరు ఒడెస్సాలో వున్న సమయంలో భారీ పేలుళ్లు వినిపించాయని సిమ్రాన్ సింగ్ తెలిపారు.అంతేకాదు.ఉక్రేనియన్ల కోసం ఆహారం, మందులు, బట్టలు తీసుకెళ్లిన సిమ్రాన్ బృందం వారికి పంపిణీ చేసింది.
ఉక్రెయిన్‌పై రష్యా దాడి తీవ్ర విధ్వంసానికి కారణమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.







