తెలుగు ప్రేక్షకులకు సీనియర్ నటి హీరోయిన్ లైలా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అప్పట్లో తన క్యూట్ క్యూట్ మాటలు, తన క్యూట్ స్మైల్ తో ఎంతో మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకుంది లైలా.
అంతేకాకుండా ఇప్పటికీ అదే అందం నవ్వుని కొనసాగిస్తూ అప్పటికీ ఇప్పటికీ అదే విధంగా కనిపిస్తుంది.ఇకపోతే లైలా ఈ మధ్యకాలంలో బుల్లితెర పైకి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
మొదట ఎగిరే పావురమా సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది లైలా.తర్వాత అనతి కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.ఇక లైలా నటించిన సినిమాలో శివ పుత్రుడు సినిమా లైలా కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
ఆ తరువాత లైలా కెరీర్ బాగా పీక్స్ లో ఉన్న సమయంలో బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం లైలా మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది.
అవకాశాల కోసం కూడా ఎదురు చూస్తోందట.ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం.
లైలా కోలీవుడ్ హీరో కార్తీ నటిస్తున్నా సర్దార్ సినిమాలో అవకాశాన్ని కొట్టేసిన తెలుస్తోంది.

ఈ సినిమాకు పి ఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఇందులో హీరో కార్తీ రెండు విభిన్నమైన గెటప్ లో ప్రేక్షకులను అలరించబోతున్నారు.అందులో ఒకటి యంగ్ పోలీసర్ పాత్ర, మరొకటి 60 ఏళ్ళ వృద్ధుడి పాత్ర.
హీరో కార్తి ఈ సినిమాలో ఎంతో చాలెంజింగ్ గా నటిస్తున్నారు.ఈ సినిమా లో లైలా ఒక కీలక పాత్రలో నటిస్తోంది అని, ఆ పాత లైలా కు మంచి పేరు చేస్తుందని కోలీవుడ్ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏదిఏమైనప్పటికీ లైలా మొదట అన్నతో హిట్ అందుకున్న లైలా, ఇప్పుడు తమ్ముడు తో రీ ఎంట్రీ ఇవ్వడం కొద్దిగా ఆశ్చర్యమే అని చెప్పవచ్చు.మరి బోలెడు ఆశలతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటున్న లైలా కు అవకాశాలు ఏమేరకు వస్తాయో చూడాలి మరి.







