సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు చూస్తే నవ్వు రాక తప్పదు.తాజాగా అలాంటి ఒక వీడియో ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ వీడియోని వైరల్ హాగ్ అనే ఓ ఇన్ స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.ఈ ఫన్నీ ఇన్సిడెంట్ రష్యాలో జరిగినట్లు వైరల్ హాగ్ పేజ్ వెల్లడించింది.
ఈ వీడియోకి ఇప్పటికే లక్షల్లో వ్యూస్ వచ్చాయి.వేలలో లైకులు వచ్చాయి.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక బ్రిడ్జిపై ఉన్న సైడ్ వాల్ రైలింగ్ పై పావురం లాంటి రెండు సీగల్ పక్షులు వాలటం చూడొచ్చు.అయితే ఈ రెండు పక్షులలో ఒక పక్షిని పట్టుకునేందుకు అక్కడికి వచ్చింది ఒక పిల్లి.
ఈ దృశ్యాలను ఒక స్థానిక అమ్మాయి తన కెమెరాలో బంధించింది.అయితే పక్షిని నోటకరచుకొని ఎంచక్కా దాన్ని ఆరగిద్దామని పిల్లి దాని కిందికి వచ్చి అలానే నిల్చుంది.
అయితే ఈ సమయంలోనే ఆ పక్షి రెట్ట వేసింది.దీంతో పిల్లి ముఖంపై వచ్చి ఆ రెట్ట పడింది.
ఈ ట్విస్ట్ ఊహించని సదరు పిల్లి ఒక్కసారిగా షాక్ అయింది.ఆ పక్షి తన ముఖం పై రెట్ట వేసింది అనే అవమానాన్ని తట్టుకోలేక అది అక్కడి నుంచి ఉరుకులు పరుగులు తీసింది.
తన ఫేస్ పైన ఉన్న ఆ వ్యర్థాన్ని తొలగించుకునేందుకు అది ఏం చేసిందో ఏమో! కానీ అక్కడ్నుంచి అది ఉరకడం చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.అయ్యో పాపం, డైరెక్ట్ హిట్, డైరెక్ట్ షాట్ తగిలిందని, పూర్ క్యాట్ అని మరి కొందరు దీనిపై సానుభూతి చెబుతున్నారు.
ఏది ఏమైనా దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెటిజన్లను బాగా నవ్వొస్తోంది.దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.