ఆంధ్రుల రాజధాని పరిష్కారం లేని సమస్యగా మారిపోయిందా అంటే అవుననే సమాధానం వస్తోంది.రాజకీయ చట్రంలో చిక్కుకుని ఏపీ రాజధాని విలవిలలాడుతోంది.
అసలు రాజధాని కల సాకారం అవుతుందా అనేది పెద్ద ప్రశ్నగా మారిపోయింది.టీడీపీ, వైసీపీ, తదితర పార్టీలు అన్ని ఎవరి పంతాలకు వారు రాజధాని అంశాన్ని వాడుకుంటున్నారు.
ఇక అధికార పార్టీ వైసీపీ విధానం ఏంటి అమరావతిపై టీడీపీ వ్యూహంఏంటనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగులిపోతోంది.
రాజధాని విషయంలో వరుసగా అధికారం చేపట్టిన రెండు పార్టీలు టీడీపీ, వైసీపీ వల్లే సమస్యగా మారుతోందనడంలో సందేహం లేదు.
అధికారం చేపట్టిన చంద్రబాబు, జగన్ ఏపీ రాజధాని కట్టలేరా ? అనే ప్రశ్న తలెత్తుతోంది.టీడీపీ వారు జగన్‌కు చేతకాదని అంటే.
వైసీపీ నేతలు బాబు వల్ల కానే కాదంటూ విమర్శలు చేసుకోవడం తప్ప రాజధానిని పట్టించుకున్న పాపాన పోలేదు.అమరావతి వట్టి భ్రమరావతి అని వైసీపీ తీసిపారేస్తోంది.50 వేల పై చిలుకు ఎకరాల్లో అమరావతి రాజధాని కట్టడానికి ఎన్నేండ్లు పడుతుందని జగన్ ప్రశ్నిస్తున్నారు.చంద్రబాబుకి విజన్ ఉంటే గుంటూరులో గానీ, విజయవాడలో గానీ 500 ఎకరాల్లో రాజధాని కట్టి ఉండేవారని చెబుతున్నారు.
అయితే బాబు నెత్తినేసుకున్న అమరావతిని తమను కట్టమంటున్నారని మండిపడుతున్నారు.మొత్తంగా అమరావతి రాజధానిని తాము కాదు మరెవరూ కట్టలేరని ఊహాగానాలు వినిపిస్తున్నారు.

మరోవైపు జగన్ మూడు రాజధానులు బెస్ట్ అంటూ అ దిశగా పయణిస్తూ వ్యూహాలు రచిస్తున్నారు.ఇది కూడా జరిగే పనేనా ? అంటే జగన్‌కు చేతకాక ప్రజల మూడ్‌ను మూడు రాజధానుల అంశంపై మళ్లిస్తున్నారని టీడీపీ యువ నేత లోకేష్ పేర్కొంటున్నారు.రాజధాని కట్టే చిత్తశుద్ధి ఉంటే ముందు ఏపీలో చిల్లులు పడిన రోడ్లకు మరమ్మతులు చేసేవారని ఎద్దేవా చేస్తున్న పరస్థితి.మొత్తంగా రోడ్లను బాగు చేయలేని జగన్ మూడు రాజధానులు కడతారంటే జనాలు నమ్మాల అని లాజిక్ గా ప్రశ్నిస్తున్నారు.
ఏపీలో రోడ్లు గత మూడేండ్లుగా గుంతలతో దర్శనమిస్తున్నాయి.వాటికే అతీగతీ లేదు మరి మూడు రాజధానుల పరిస్థతి ఏంటనేది ఊహకందని సమాధానమే.మరోవైపు ఏపీకి డబ్బులు లేవు, కేంద్రం సాయం చేయదు.ఇలాంటి వేళ గొప్పలకు పోయి గత టీడీపీ రాజధాని అంశం భుజానికెత్తుకుంది.
ప్రస్తుతం ఇరు పార్టీల వారు పంతాలు వీడి రాజధాని కట్టాలని, అమరావతితోపాటు విశాఖ, కర్నూల్ కూడా అభివృద్ధి పర్చాలని జనాలు కోరుకుంటున్నారు.మరి రాజధాని అంశం కలగా మిగులుతుందా ? కల నెరవేరుతుందా ? అనేది వేచి చూడాలి.







