యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై గందరగోళం.. తగ్గేదేలే అంటున్న ఇరు పార్టీలు

తెలంగాణ రాజకీయాల్లో వరి ధాన్యం కొనుగోళ్ల అంశం సెగలు పుట్టిస్తోన్న విషయం తెలిసిందే.ఇప్పటికే తెలంగాణలో పండిన వరిధాన్యాన్ని మొత్తం కేంద్రం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుపడుతుండగా కేంద్రం మాత్రం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఎటువంటి విధానాన్నైతే అనుసరిస్తున్నామో అదే విధానాన్ని తెలంగాణలో కూడా అనుసరిస్తామని కానీ తెలంగాణకంటూ ప్రత్యేక విధానాన్ని అమలు చేయడం అనేది కుదరదని మేము తీసుకునే వరకే తీసుకుంటామని మిగిలిన ధాన్యం కొనుగోలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది మాత్రమేనని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

 Confusion Over The Purchase Of Yasangi Rice Grain .both Parties Say It Is Declin-TeluguStop.com

అయితే దీంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అంగీకరించక పోతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో గందరగోళం నెలకొంది.అయితే ఇక ఉగాది తరువాత ఉగ్ర రూపమేనని రాష్ట్ర మంత్రులు ప్రకటిస్తుండటం కేంద్ర మంత్రి తెలంగాణ ప్రజల్ని నూకలు తినమన్నాడని పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుండటంతో రాజకీయంగా బీజేపీకి, టీఆర్ఎస్ కు మధ్య మాటల తూటాలు పేలుతున్న పరిస్థితి ఉంది.

అయితే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వరి ధాన్యాన్ని కొనే వరకు వదిలి పెట్టే సమస్యే లేదని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాల జిల్లాపరిషత్ లు, మండల పరిషత్ లు, మార్కెట్ కమిటీల నుండి ప్రధాని మోడీకి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తీర్మాణాలను నేడు పంపనున్న విషయం తెలిసిందే.ఏది ఏమైనా వరి ధాన్యం కొనుగోళ్ల విషయం లో వివాదం రోజురోజుకు వివాదం ముదురుతున్న నేపథ్యంలో మరి బీజేపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మొండిపట్టు వీడుతుందా లేక ఇప్పుడు అనుసరిస్తున్న వైఖరినే కొనసాగిస్తుందా అన్నది ఇప్పుడే మనం  స్పష్టంగా చెప్పలేకపోయినా రానున్న రోజుల్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube