ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ టాక్ తో రికార్డులు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే.సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ మూవీ బాగుందని మెజారిటీ ప్రేక్షకులు చెబుతుంటే కొందరు మాత్రం ఈ సినిమాలో కథ లేదని కామెంట్లు చేస్తుండటం గమనార్హం.
అయితే ఆర్ఆర్ఆర్ గురించి ఇలా నెగిటివ్ గా ప్రచారం చేస్తున్న వాళ్లలో ఒక స్టార్ హీరో ఫ్యాన్స్ ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
రాజమౌళి ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయని ఒక స్టార్ హీరో అభిమానులు తమ ఫేవరెట్ హీరో సినిమా ద్వారా క్రియేట్ చేసిన కొన్ని రికార్డులను ఆర్ఆర్ఆర్ బ్రేక్ చేయడంపై అసంతృప్తితో ఉన్నారని సమాచారం అందుతోంది.
అదే సమయంలో ఏపీ ప్రభుత్వం తమ హీరో విషయంలో ఒకలా వ్యవహరిస్తే ఆర్ఆర్ఆర్ మూవీ విషయంలో మరో విధంగా వ్యవహరించిందని ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది.

ఏపీలో ఆర్ఆర్ఆర్ సినిమా బెనిఫిట్ షోలకు ఎలాంటి ఆటంకం కలగలేదు.ఏపీలో అదనపు షోలకు అనుమతులు లభించడంతో పాటు టికెట్ రేటుపై ఏకంగా 75 రూపాయలు పెంచుకునే అవకాశం లభించడం ఆర్ఆర్ఆర్ పాలిట వరమైంది.ఫస్ట్ వీకెండ్ వరకు ఈ సినిమాకు టికెట్లు దొరకని వాళ్లు మండే నుంచి ఈ సినిమాకు టికెట్లు బుకింగ్ చేసుకుంటున్నారు.
హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో ఫస్ట్ వీక్ వరకు టికెట్లు దాదాపుగా బుకింగ్ అయ్యాయి.
ఆర్ఆర్ఆర్ విషయంలో ఏపీ సర్కార్ తీరును ఒక స్టార్ హీరో ఫ్యాన్స్ వ్యతిరేకించడంతో పాటు ఆర్ఆర్ఆర్ మూవీని టార్గెట్ చేస్తున్నారని తెలుస్తోంది.
ప్రభుత్వం ఒక్కో సినిమా విషయంలో ఒక్కో విధమైన నిబంధనలు అమలు చేస్తూ ఉండటం ఈ స్టార్ హీరో అభిమానులను బాధిస్తోంది.ఆర్ఆర్ఆర్ ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్లు సొంతం చేసుకుంటుందో చూడాలి.







