వాట్సాప్ వినియోగదారుల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మల్టీ డివైస్ వినియోగం అందుబాటులోకి రానే వచ్చింది.తాజాగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినయోగదారులు తమకు ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా యాప్ ద్వారా సందేశాలు పంపవచ్చు.
అంతేకాకుండా ఒకేసారి వేర్వేరు డివైజ్‌లలో వాట్సాప్‌ను ఆపరేట్ చేయొచ్చు.తొలుత దీనిని బీటా వెర్షన్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ విధానంలో ఒకేసారి నాలుగు డివైజ్‌లు, ఒక ఫోన్‌కు వాట్సాప్ వినియోగించే సౌకర్యం ఉంది.అయితే 14 రోజులు ఉపయోగించకుండా ఉంటే అవి డిస్‌కనెక్ట్ అవుతాయి.
మీ మొబైల్‌లోని వాట్సాప్ పై క్లిక్ చేసి, మూడు చుక్కల మెనూపై నొక్కండి.లింక్ చేయబడిన పరికరాలను ఎంచుకోండి.iOS వినియోగదారుల కోసం, సెట్టింగ్‌ల చిహ్నాన్ని నొక్కడం ద్వారా వాట్సాప్ వినియోగించే లింక్డ్ పరికరాలపై క్లిక్ చేయండి.పరికరాన్ని లింక్ చేయడం ఎంచుకోవాలి.
బయోమెట్రిక్ కోసం మీ ఫోన్‌ని అన్‌లాక్ చేయండి.వాట్సాప్ వెబ్‌ను మీ పీసీలలో లేదా ల్యాప్‌టాప్ లలో ఓపెన్ చేయాలి.
స్క్రీన్‌పై కనిపించే క్యూఆర్ కోడ్‌ను సెల్‌ఫోన్ ద్వారా స్కాన్ చేయండి.తర్వాత ఒకే సమయంలో ఇలా మల్టీ డివైస్‌ల ద్వారా వాట్సాప్‌లో సందేశాలు పంపొచ్చు.
వాట్సాప్ లాగిన్ అయ్యే సమయంలో ఫోన్‌కు, పీసీ లేదా ల్యాప్‌టాప్‌కు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి.ఆ తర్వాత ఫోన్‌కు ఇంటర్నెట్ లేకపోయినా వాట్సాప్ అకౌంట్ ల్యాప్‌టాప్ లేదా పీసీలో రన్ అవుతుంది.

ఈ మల్టీడివైస్ సౌకర్యం బీటా వెర్షన్ వారికి మాత్రమే ఇప్పటి వరకు అందుబాటులో ఉండేది.అయితే ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు.తద్వారా ఫోన్‌కు ఇంటర్నెట్ కనెక్షన్ వీక్‌గా ఉన్నా, తక్కుడ డేటా ఉన్నా మల్టీ డివైజ్ ఆప్షన్ ఉపయోగపడుతుంది.అయితే పీసీ లేదా ల్యాప్‌టాప్‌కు మాత్రం ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరి.
ఇంతకు ముందు రెండింటికీ ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరిగ్గా ఉంటేనే పీసీ లేదా ల్యాప్‌టాప్‌లలో వాట్సాప్ వెబ్ పనిచేసేది.







