ప్రముఖ టాలీవుడ్ రచయితలలో విజయేంద్ర ప్రసాద్ ఒకరనే సంగతి తెలిసిందే.విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు ఘన విజయం సాధించాయి.
అయితే విజయేంద్ర ప్రసాద్ దర్శకుడిగా కొన్ని సినిమాలు చేసినా ఆ సినిమాలు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం కావడం గమనార్హం.అయితే ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
ఒక జర్నలిస్ట్ విజయేంద్ర ప్రసాద్ ను ఎన్టీఆర్ ది కమ్మ కులమని చరణ్ ది కాపు కులమని కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయ తెరంగేట్రం చేస్తున్నారా? అని ప్రశ్నించారు.ఆ ప్రశ్నకు తనకు 1966 సంవత్సరంలో మ్యారేజ్ అయిందని తనది కమ్మకులమని లవ్ మ్యారేజ్ కాబట్టి తన భార్యది ఏ కులమో అప్పట్లో తెలియదని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.
ఖైదీ మూవీ రిలీజైన సమయంలో ఆమె మా చిరంజీవి అని చెప్పిందని మా చిరంజీవి అంటే ఏమిటని అడగగా చిరంజీవి మా కాపులేగా అని అన్నారని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.
తమ కుటుంబంలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఎక్కువగా జరిగాయని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.
మా అమ్మాయిలు ఇతర కులాల వాళ్లను పెళ్లి చేసుకున్నారని ఆయన అన్నారు.మా ఫ్యామిలీలో కులం ప్రస్తావన అస్సలు ఉండదని కులాలను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం జరిగే అవకాశమే లేదని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.
ఆర్ఆర్ఆర్ మూవీ కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని ఆయన అన్నారు.

ఆర్ఆర్ఆర్ కథలో ప్రేక్షకులు లీనమైన తర్వాత ఏ హీరోకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనే విషయాన్ని మరిచిపోతారని ఆయన చెప్పుకొచ్చారు.మరి ఆర్ఆర్ఆర్ విడుదలైన తర్వాత ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.సినిమాసినిమాకు జక్కన్నకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
ఆర్ఆర్ఆర్ మూవీ ఏకంగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది.







