ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో రోడ్లపై వదిలేవేయబడిన/ గుర్తుతెలియని వాహనాలను ఈనెల 26న ఖమ్మం సిటీ ట్రైనింగ్ సెంటర్లో వేలం వేయనున్నట్లు పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు.
సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం.పోలీస్ స్టేషన్లలో ఉన్న 357 వాహనాలను సంబంధిత యజమానులు తీసుకెళ్లాలని, ఆరు నెలల్లోగా తీసుకోకపోతే వేలం వేస్తామని గత ఏడాది జులై ,ఆగష్టు నెలలో ప్రకటించామని, ఇప్పటి వరకు వాహనాలను తీసుకెళ్లేందుకు రాకపోవడంతో మొత్తం వివిధ రకాల 338 వాహనాలలో 316 వాహనాలు ఖమ్మం పోలీస్ శిక్షణ కేంద్రంలో, 22 వాహనాలు ముదిగొండ పోలీస్ స్టేషన్ లో ఈనెల 26న వేలం వేయనున్నట్లు ప్రకటించారు.
వేలంలో పాల్గొనే వారు ఆధార్ కార్డు, ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డుతో సహా హాజరుకావాలన్నారు.వేలంపాటలో పాల్గునే వారు ఇట్టి వాహనములను ఈ రోజు నుండి సందర్శించవచ్చని, ఇతర వివరాల కోసం MTO – 9440795306,ట్రాఫిక్ సీఐ- 7901143517, CCRB,సీఐ -9440904883,ముదిగొండ ఎస్ఐ- 9440904253 నెంబర్లలో సంప్రదించగలరు.







