ఐపీఎల్ మ్యాచ్ లు సమీపిస్తున్న తరుణంలో క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.ఐపీఎల్ డిస్నీ+ హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రసారం కానుంది.
ఏ ఒక్క మ్యాచ్ మిస్ అవ్వకుండా ఉండటానికి చాలామంది డిస్నీ+ హాట్ స్టార్ ఓటీటీ సభ్యత్వాన్ని పొందాలని చూస్తున్నారు.టెలికాం ఆపరేటర్లు వాస్తవానికి వారి ప్రిపెయిడ్ ప్లాన్ తో ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ సబ్స్క్రిప్షన్ చేస్తారు.
రిలయన్స్ జియో డిస్నీ+ హాట్స్టార్ ప్లాన్ లు రిలయన్స్ జియో టెల్కో తమ వినియోగదారులకు 28 రోజుల వ్యాలిడిటీ తో రూ.601తో అపరిమిత లోకల్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ పాటు 3జీబీ డేటాను అందిస్తోంది.ఈ రోజువారి 3జిబి డేటాతో పాటు అదనంగా 6జిబి డేటాను కూడా అందిస్తోంది.జియో సంస్థ 499 మరోక ప్లాన్ కూడా అందిస్తోంది.ఇది 28 రోజులకు 2జిబి డేటా, అపరిమిత కాల్స్, 100 ఎస్ఎంఎస్ లు వంటి ఎన్నో ప్రయోజనాలను తీసుకొచ్చింది.జియో నుండి పేర్కొన్న రెండు ప్లాన్ లు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా రూ.499విలువైన డిస్నీ+హాట్ స్టార్ మొబైల్ కి ఒక సంవత్సరం పాటు యాక్సిస్ ను ఉచితంగా అందిస్తోంది.వినియోగదారులు జియో సినిమా, జియో టివి వంటి మరెన్నో జియో అప్లికేషన్లు కూడా ఉచిత యాక్సిక్ ఇస్తోంది.
రోజువారి డేటా పరిమితిని ఉపయోగించిన తరువాత వినియోగదారులు 64 కెబిపిఎస్ తో ఇంటర్నెట్ వేగాన్ని ఆనందించే అవకాశముంది.అలాగే ఇక వోడాఫోన్, ఐడియా కూడా రూ.601 ధర వద్ద అందించే ప్లాన్ తో డిస్నీ+ హాట్ స్టార్ కి ఉచిత యాక్సెస్ ను అందిస్తోంది.

రూ.601తో 100 ఎస్ఎంఎస్ తో పాటు అపరిమిత లోకల్ కాల్స్ పాటు రోజుకు 3 జిబి డేటాను 28 రోజులు అందించనుంది.రూ.901 అందించే మరోక ప్లాన్ 70 రోజుల చెల్లుబాటు కాలానికి రోజుకు 3 జిబి డేటా, 100 ఎస్ఎంఎస్ లు, అపరిమిత లోకల్ కాల్స్ వంటి ప్రయోజనాలు అందిస్తోంది.వినియోగదారులు రూ.601, రూ.901 ప్లాన్ తో అదనంగా 16జిబి మరియు 48 జిబి డేటాను పొందనున్నారు.ఎయిర్టెల్- డిస్నీ+ హాట్ స్టార్ ప్లాన్ లు ట్రూలీ అన్ లిమిటెడ్ ప్యాక్ ల విభాగం క్రింద రూ.599 ప్లాన్ ను అందజేస్తుంది.100 ఎస్ఎంఎస్ తో పాటు రోజుకు 3జిబి డేటాను అందించనుంది.ఎయిర్టెల్ రూ.838 ధర ట్యాగ్ తో 2జిబి రోజువారి డేటా ప్లాన్ కూడా అందిస్తోంది.అమెజాన్ ప్రైమ్ వీడియా కోసం ట్రయల్ ఆఫర్ ను కూడా అందిస్తున్నాయి.







