తీవ్రమైన వ్యతిరేకతే కేసీఆర్ ను మరో సారి విజయతీరాలకు చేర్చనుందా?

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు అనేవి చాలా సహజమైనటు వంటి విషయం.అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తుండటం, తమ పనితీరుతో ప్రతిపక్షాలకు తిరిగి కౌంటర్ ఇచ్చే పరిస్థితి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉంటుంది.

 Should Serious Opposition Lead Kcr To Victory Once Again-TeluguStop.com

రాజకీయాల్లో ఇవి షరామామూలే అని మనం చెప్పుకోవచ్చు.అయితే ఏ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఆ రాష్ట్రానికి ప్రత్యేకం.

ఒక రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఇంకో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఒకేలా ఉండవు.అందుకే ప్రతి ఒక్క పార్టీ ఇతర రాష్ట్రాల ప్రగతిని వేలెత్తి చూపిస్తూ రాజకీయంగా విమర్శలు గుప్పిస్తుంటాయి.

ఇక్కడ ప్రస్తుతం తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో ముచ్చటగా మూడో సారి ముఖ్యమంత్రి  కేసీఆర్ అధికారంలోకి రాకుండా విశ్వ ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది.అందులో భాగంగా ఇక ప్రతి ఒక్క అంశాన్ని వెలికితీస్తూ ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత పెంపొందించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.

అయితే ఈ తీవ్ర వ్యతిరేకతే కేసీఆర్ ను ముచ్చటగా మూడో సారి విజయ తీరాలకు చేరుస్తుందా అంటే అవుననే సమాధానం చాలా మంది వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.ఎందు కంటే ఒక బలమైన నాయకుడిని పడగొట్టడానికి ఇంత మంది వస్తున్నారంటే తమ రాజకీయ స్వార్థం కొరకు మాత్రమే నాపై విమర్శల దాడి చేస్తున్నారని తెలంగాణను అభివృద్ది పధంలో నడుస్తుందంటే ఇక వారికి రాజకీయ ఎదుగుదల ఉండదనే ఇలా నాపై దాడి చేస్తున్నారనే ఒక భీకర ప్రచారాన్ని ఎన్నికల ప్రచారంలో తీసుకెళ్ళే అవకాశం వందకు  వంద శాతం ఉంది.

అయితే దీనిని ప్రతిపక్షాలు బలంగా తిప్పికొట్టే అవకాశం ఉన్నా ప్రజలు ఎవరి ప్రచారాన్ని విశ్వసిస్తారనేది, ఎవరికి మద్దతిస్తారనేది ఇప్పుడే మనం స్పష్టంగా చెప్పలేకపోయినా రానున్న రోజుల్లో మనకు తెలిసే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube