మెగా హీరో రామ్ చరణ్ ఒక వైపు జక్కన్న సినిమా ఆర్‌ఆర్ఆర్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.మరో వైపు సౌత్ లోనే కాకుండా ఇండియాలోనే దిగ్గజ దర్శకుడిగా పేరు దక్కించు కున్న శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
డే టైం లో ప్రమోషన్ కార్యక్రమాలు.నైట్ టైమ్ లో షూటింగ్ అంటూ రామ్ చరణ్ హడా విడి చేస్తున్నాడు.
పెద్ద ఎత్తున రెండు సినిమాలకు ఒకే సారి వర్క్ చేయడం అంటే మామూలు విషయం కాదు.అది కూడా రెండు పెద్ద సినిమాలు దర్శకులు టాలీవుడ్ జక్కన్న రాజమౌళి మరియు శంకర్ లు ఏ స్థాయి దర్శకులు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.
శంకర్ దర్శకత్వంలో ఒక్క సినిమా చేయడమే హీరో లు అదృష్టంగా భావిస్తూ ఉంటారు.అలాంటిది వారిద్దరి సినిమాలను ఒకేసారి ఒకే రోజు చేయడం అంటే మామూలు విషయం కాదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రాజమౌళి సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంటూ శంకర్ సినిమా కు సంబంధించిన షూటింగ్ లో పాల్గొంటున్న రామ్ చరణ్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు అంటూ మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇటీవలే శంకర్ సినిమా షెడ్యూల్ పూర్తి చేసిన రాం చరణ్ జక్కన్న రాజమౌళి తో కలిసి దుబాయి వెళ్లాడు.
రెండు రోజుల పాటు దుబాయి లో సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ తెలుగు వారితో పాటు ఇతర ఇండియన్స్ తో ఇంట్రాక్ట్ అవ్వడంతో పాటు అక్కడి ప్రేక్షకుల అభిప్రాయాలను కూడా తెలుసు కోబోతున్నారు.
రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా ఉన్నాడు.భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసేందుకు గాను చిత్ర యూనిట్ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.
అతి త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.మార్చి 25 తారీఖున ఈ సినిమా ను ప్రపంచ వ్యాప్తం గా భారీ ఎత్తున విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.







