టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో సినిమా అంటే దేశ వ్యాప్తంగా సినీ అభిమానులకు ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది అనడంలో సందేహం లేదు.దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ సినిమా ఎక్కడ తగ్గకుండా ప్రమోషన్ విషయంలో కూడా భారీగా నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే సినిమా కు అంచనాలు ఒక లెవల్ లో ఉన్నాయి.అయినా కూడా ఏ మాత్రం తగ్గకుండా ఖర్చు కు వెనకాడకుండా చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్ ను భారీగా చేస్తున్నారు.
సినిమా ను జక్కన్న ఎంత పెద్ద శ్రద్ధతో తెరకెక్కిస్తాడో అంతే శ్రద్ద తో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి తో హీరోలు ఇద్దరు మరియు జక్కన్న రాజమౌళి కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల తో అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ సరదాగా సాగింది.అలాగే ఆయన అడిగిన ప్రశ్నలు కూడా సరదా సరదా ఉన్నాయి అంటూ కామెంట్స్ దక్కించుకుంది.సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను తెలియ జేయడంతో పాటు.ఇంటర్వ్యూ లో ఇద్దరు హీరోలు తమ గురించి తెలియజేశారు.దాంతో చాలా మంది ఆ ఇంటర్వ్యూ వీడియో లను చూస్తున్నారు.సోషల్ మీడియాలో మరియు వెబ్ మీడియా యూట్యూబ్ ఇలా ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం అనిల్ రావిపూడి తో ఆర్ ఆర్ ఆర్ ఇంటర్వ్యూ వీడియోలు మరియు వార్తలు వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి.
సినిమా కు అనూహ్యంగా ఈ ఇంటర్వ్యూ తో మరింతగా ఆదరణ పెరిగిందని అంటున్నారు.ఈ సినిమా గురించి పతాక స్థాయి లో ఈ సమయంలో చర్చ జరుగుతోంది.
ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన వార్తలు విశేషాలు మీడియాలో ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో అనిల్ రావిపూడి సూపర్ హిట్ అయ్యాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.







