బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ప్రెసెంట్ వరుస సినిమాలతో బిజీగా ఉంది.ఈమె సినిమాలతో ఎంత బిజీగా ఉందో ఆమె ప్రేమ వ్యవహారంతో కూడా అంతే బిజీగా గడుపుతుంది.
ఈ బ్యూటీ బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తప్పుడు ఇషాన్ ఖట్టర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి ఉందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.వీరిద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు.
ఎక్కడ చుసిన వీరి జంట కనిపిస్తుంది.చెట్టాపట్టాలేసుకుని ఇద్దరు తిరుగు తూన్నారు.
అనన్య పాండే, ఇషాన్ ఖట్టర్ ఖలీ పిలీ సినిమాలో కలిసి నటించారు.అప్పటి నుండి వీరిద్దరూ ప్రేమాయణం సాగిస్తున్నప్పటికీ వీరు మాత్రం బయటకు చెప్పలేదు.
కానీ పార్టీలకు, పబ్ లకు కలిసి కనిపిస్తుండడంతో దాటినా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.తాజాగా వీరి ప్రేమ గురించి బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా చర్చించు కుంటున్నారు.
ఈ క్రమంలోనే ఇషాన్ మదర్ వీరి ప్రేమ గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో ఈ వార్త మరింత వైరల్ అయ్యింది.

”అనన్య మా ఫ్యామిలీ సర్కిల్స్ లో ఒకరు.న కొడుకుకి మంచి స్నేహితురాలు.షాహిద్, మీరా తో కూడా ఆమె చాలా బాగా మాట్లాడుతుంది.
అందరితో యిట్టె కలిసి పోతుంది” అంటూ ఆమె మదర్ కాబోయే కోడలి గురించి చెప్పడంతో ఈ వార్త వైరల్ అయ్యింది.ఇక వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోనున్నారని టాక్.

మరి వీరి ప్రేమ విషయం బయటకు ఎప్పుడు చెబుతారో తెలియదు కానీ ఈ వార్త గురించి మాత్రం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా చర్చించు కుంటున్నారు.ప్రెసెంట్ ఈ బ్యూటీ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో నటిస్తుంది.విజయ్ దేవరకొండకు జంటగా నటిస్తుంది.ఈ సినిమా ఆగస్టు 2న రిలీజ్ కానుంది.ఈ సినిమాతో ఈమె సౌత్ లో కూడా గుర్తింపు తెచ్చుకోనుంది.







