తెలుగు సినీ ప్రేక్షకులకు బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె కేవలం ఇండియన్ సినీ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో మందికి ఈమె సుపరిచితమే.
సన్నీలియోన్ ప్రపంచవ్యాప్తంగా ఒక తరహా సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది.సన్నీ లియోన్ హీరోయిన్ పాత్రలను చేస్తూ తన పై ఉన్న పాత ముద్రను తొలగించుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
అయితే సన్నీ లియోన్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే చాలా సంవత్సరాలు అయిన విషయం తెలిసిందే.
సన్నీలియోన్ సినిమాల ద్వారానే బాగా గుర్తింపు తెచ్చుకుంది.
అయితే ఈమెకు హాట్ పాత్రలు మాత్రమే ఆఫర్ చేస్తున్న ఫిలిం మేకర్స్ చాలా మంది బాలీవుడ్ లోనే ఉన్నారు.అయితే ఎంత మంది ఆమెను ఎన్ని విధాలుగా అనుకున్నప్పటికీ సన్నీలియోన్ మాత్రం అలాంటి వారిని పట్టించుకోవడం లేదు.
కేవలం తనను అభిమానించే వారు మంచి దృష్టితో చూసినా చాలు అని అంటుంది.ఇదిలాఉంటే ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న సన్నీలియోన్ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.అయితే మొదట ఒక పాపను దత్తత తీసుకున్న సన్నీ లియోన్ దంపతులు ఆ తర్వాత సరోగసీ ద్వారా తల్లిదండ్రులు అయ్యారు.
సన్నీలియోన్ కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన కుటుంబం కోసం కావాల్సినంత సమయాన్ని వెచ్చిస్తూ ఉంటుంది.
అంతేకాకుండా ఆమె విషయంలో ఆమె పిల్లల విషయంలో నిత్యం సోషల్ మీడియాలో ట్రోలింగ్ బ్యాడ్ కామెంట్ చేస్తున్నప్పటికీ ఆమె అలాంటివి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటుంది.

అంతేకాకుండా సన్నీలియోన్ వ్యక్తిగతంగా మంచి పనులు చేసినప్పటికీ.ఆమె చేసిన పాత సినిమాలు మరియు పాత పాత్రలను చూస్తూ ఉంటారు.ఇంకా చెప్పాలి అంటే సోషల్ మీడియాలో ఒక వర్గానికి చెందిన వారు ఆమెను తరచూ ఏదో ఒక విషయంలో ట్రోలింగ్స్ చేస్తూనే ఉంటారు.
అయితే అటువంటి వారిపై సన్నీ లియోన్ స్పందిస్తూ.వారు నాకు చుట్టాలు స్నేహితులు కారు.అలాంటి వారి గురించి నేను ఎక్కువగా పట్టించుకోను.అలాగే వాళ్ళు నన్ను విమర్శిస్తూ పాపులారిటీ సంపాదించుకోవాలి అనుకుంటున్నారు.
కానీ నా పిల్లలకు కనీసం వారు డైపర్లు కూడా మార్చేందుకు హెల్ప్ చేయలేదు.అలాంటి వారి గురించి నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ ఘాటుగా స్పందించింది సన్నీలియోన్.







