బిగ్ బాస్ వల్ల అది పోగొట్టుకున్న సిరి హన్మంత్.. ఇప్పుడు మరొకటి కూడా?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ రియాల్టీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ షో ప్రసారం అవుతున్నప్పటికీ తెలుగులో మాత్రంవిపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది.

 Siri Hanmanth Suffering From Leg Injury , Bigg Boss , Injury Leg , Siri Hanumant-TeluguStop.com

ఇప్పటికే తెలుగులో 5 సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.ఇక ఐదవ సీజన్ ఇటీవలే ముగియగా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో బిగ్ బాస్ నాన్ స్టాప్ షో అంటూ ప్రసారమవుతుంది.

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కంటెస్టెంట్ సిరి హనుమంత్ గురించి మనందరికీ తెలిసిందే.

ఎంతో పాపులారిటీతో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సిరి హనుమంతు అంతకు రెండింతలు నెగిటివిటీ మూటగట్టుకుని బయటకు వచ్చింది.

ఇక ఐదవ సీజన్ లో సిరి హనుమంతు ఒక టాస్క్ లో భాగంగా గాయపడిన విషయం తెలిసిందే.అయితే ఆ గాయాలు ఇప్పటికీ ఆమెను వెంటాడుతూనే ఉన్నాయట.

ఈ క్రమంలోనే తాజాగా సిరి హనుమంతు ఒక వీడియోని షేర్ చేసింది.టికెట్టు ఫినాలే టాస్క్ లో భాగంగా జరిగిన ఐస్ ఛాలెంజ్ లో కొందరు కంటెస్టెంట్ లు గాయపడిన విషయం తెలిసిందే.

అలా గాయపడిన వారిలో సిరి హనుమంతు కూడా ఒకరు.సిరి కి గాయాలు అవ్వడం తో వెంటనే మెడికల్ బుక్ లోకి తీసుకెళ్ళి చికిత్స చేశారు.

కాని ఆమెకు తగ్గకుండా అంతకంతకూ తీవ్రం అయింది.ఆ గాయాలు పెద్దవి అవ్వడం తో ఆమె సరిగా ఆటలు కూడా ఆడలేకపోయింది.కనీసం లేచి నడవడానికి కూడా కష్టమైపోయింది.ఇక ఆ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత సిరి ఇంటికే పరిమితమై పోయింది.ఇక ఇటీవలే ఒక వీడియో లో ఆమె రెండు కాళ్లపై కొద్దిగా చర్మం లేచిపోయినట్లుగా కనిపించింది.ఇక బిగ్ బాస్ షోలో తగిలిన గాయాలకు సంబంధించిన బాధను ఇప్పటికీ అనుభవిస్తోంది.

తాజాగా షేర్ చేసిన వీడియోతో ఆ విషయం కాస్త బయటికి వచ్చింది.ఆ వీడియోలో ఆమె కాలి బొటనవేలి గోరు లేకుండా కనిపించింది.

పక్కనే ఉన్న ఇంకొక వేలుకు సైతం గోరు ఊడిపోతోంది.దీనికి ఇంకొకటి రెడీగా ఉంది అని తెలిపింది.

Siri Hanmanth Suffering From Leg Injury

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube