నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని భారీ వసూళ్లు కూడా రాబట్టింది.
చాలా రోజుల తర్వాత బాలయ్యకు ఇటు బోయపాటి కి మంచి విజయం దక్కడంతో ఆనందంగా ఉన్నారు.వీరిద్దరి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా కూడా హిట్ అవ్వడమే కాదు కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వచ్చాయి.
ఈ సినిమా సూపర్ హిట్ అందుకున్న ఖుషీలో బాలయ్య తన తర్వాత సినిమా కూడా స్టార్ట్ చేసారు.యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య 107 వ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.
గోపిచంద్ మలినేని క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.ఇక ఇప్పుడు ఈ మాస్ వ్యక్తులు ఇద్దరు రంగంలోకి దిగడంతో సినిమా ఎలా ఉండ బోతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

భారీ యాక్షన్ సీక్వెన్స్ తో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టారు.అయితే లొకేషన్ ఫోటో లీక్ అవ్వడంతో బాలయ్య లుక్ బయటకు వచ్చింది.దీంతో మేకర్స్ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు.ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుండగా కీలక పాత్రలో విజయ్ దునియా, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు.
ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో సెట్ లో ఒక స్టార్ డైరెక్టర్ సందడి చేసాడు.
ఈ షూటింగ్ స్పాట్ లో బోయపాటి శ్రీను అడుగుపెట్టాడు.
ఈ సెట్ ను సందర్శించి టీమ్ తో కాసేపు మాట్లాడారు.మేకర్స్ అందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
బాలయ్య, బోయపాటి, గోపీచంద్ మలినేని కలిసి దిగిన ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది.ఆ ఫొటోలో బాలయ్య లుక్ మరోసారి అభిమానులు వీక్షించారు.







