11 మార్చి 2011 సంవత్సరం నాడు వైసీపీ పార్టీ ఆవిర్భవించడం తెలిసిందే.దీంతో నేడు 11 సంవత్సరాలు ముగించుకొని 12 వ సంవత్సరంలో అడుగు పెట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ క్యాడర్… పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు.ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైయస్ జగన్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.“దేవుని దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో నేడు 12వ ఏట అడుగుపెడుతున్నాం.మేనిఫెస్టోయే భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి ప్రతి ఇంటా విద్య, ఆర్థిక, సామాజిక విప్లవాలకు దారులు తీస్తున్నాం.మన లక్ష్యాలు సాకారం అవుతున్నాయి.మన విజయాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి! అంటూ పోస్ట్ పెట్టారు.
సరిగ్గా 2011వ సంవత్సరం ఈనాడు కాంగ్రెస్ పార్టీని కాదని ఒంటరిగా బయటకు వచ్చిన వైఎస్ జగన్… తనతో పాటు కాంగ్రెస్ పార్టీని కాదని బయటకు వచ్చిన మిగతా వారితో కలిపి ఉప ఎన్నికలకు వెళ్లినా జగన్ దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా విజయం సాధించారు.
ఏకంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం అధ్యక్షురాలు సోనియా గాంధీతో. నువ్వా నేనా అన్నట్టు గా వ్యవహరించి వైఎస్ జగన్ ఏపీలో సత్తా చాటారు.
అలా ఒంటరిగా కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన జగన్ ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ… దేశంలోనే అత్యధిక ఎంపీలు కలిగిన పార్టీగా వైసీపీని నాలుగో స్థానంలో నిలబెట్టారు.దీంతో సరిగ్గా నేడు 12వ వసంతంలోకి పార్టీ అడుగు పెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు.