ఉత్త‌రాది ఎన్నిక‌ల ఫ‌లితాలు.. జ‌గ‌న్‌కు మైన‌సేనా ?

ఇటీవ‌ల వెలువ‌డిన ఉత్త‌రాది ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల్లో బీజేపీ దూకుడు మామూలుగా లేదు.అతిపెద్ద రాష్ట్రం అయిన యూపీలో బీజేపీ ఓడిపోతుంద‌ని అనుకున్నారు అంతా.

 Northern Five States Election Results Minus To Jagan Details, Ap Political News,-TeluguStop.com

కానీ, బీజేపీ పుంజుకుని ఏక‌ఛ‌త్రాధిప‌త్యంగా అధికారం చేజిక్కించుకుంది .ఇక ఉత్త‌రాఖండ్‌, మ‌నిపూర్ రాష్ట్రాల్లోనూ విజ‌య‌ఢంకా మోగించింది.అలాగే తీర ప్రాంత ప‌ర్యాట‌క రాష్ట్రం గోవాలోనూ బీజేపీ స‌త్తాచాటింది.ఒక‌ విధంగా చెప్పాలంటే బీజేపీకి ఎదురించి నిల‌బ‌డే పార్టీ లేకుండా పోయింద‌ని టాక్‌.కాగా ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఏపీ రాష్ట్రంపై ప్ర‌భావం చూపుతాయ‌నే వాద‌న వినిపిస్తోంది.దీనికి కార‌ణం లేక‌ పోలేదు.

జాతీయ స్థాయిలో బీజేపీ ఫుల్ మెజార్టీ దిశ‌గా దూసుకు పోతున్న విష‌యం విధిత‌మే.ఈ లెక్క‌న వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లోనూ ఒంట‌రిగానే అధికారంలోకొచ్చే వీలుంది.

అయితే కేంద్రానికి ఇత‌ర పార్టీల‌తో అవ‌స‌రం అనేది ఉండ‌దు.దీంతో ఏపీ వైసీపీ నేత‌లు పెట్టుకున్న ఆశ‌లు అడియాస‌లయ్యే ప‌రిస్థితినెల‌కొంది.

ఎందుకంటే గ‌త ఎన్నిక‌ల్లో కేంద్రంలో ఎవ‌రికీ మెజారిటీ రావొద్ద‌ని .త‌ద్వారా త‌మ మ‌ద్ద‌తు అస‌వ‌రం ఉంటుంద‌ని భావించారు.కానీ, నాడు బీజేపీకి ఫుల్ మెజారిటీ ద‌క్కింది.ప్ర‌స్తుతం సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనూ ఫుల్ మెజార్టి వ‌చ్చింది.దీంతో బీజేపీపై ఆశ‌లు పెట్టుకున్న వైసీపీని ఇక ప‌ట్టించుకుంటారా ? అనే ప్ర‌శ్న త‌లెత్తుతోంది.

Telugu Apcm, Ap, Ap Ysrcp, Bjp, Manipur, Narendra Modi-Political

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ కేంద్రానికి త‌లొగ్గిన‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చారు.నిధుల విష‌యంలోనూ, అభివృధ్ధి విష‌యంలోనూ, ప్ర‌తిప‌క్షం ఆరోపిస్తున్న‌ట్టు జ‌గ‌న్‌పై కేసుల కోస‌మో మోడీకి బెండ్ అయిన‌ట్టు రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.బీజేపీకి కూడా భ‌విష్య‌త్‌లో వైసీపీ మ‌ద్ద‌తు అవ‌స‌రం ఉంటుంద‌ని భావించారు.

కానీ, ప్ర‌స్తుతం సీన్ రివ‌ర్స్ అయింది.దేశం మొత్తం బీజేపీకి అనుకూ వాతార‌ణం నెల‌కొన‌డంతో ఫుల్ జోష్‌లో ఉంది.

ఇక వైసీపిని లెక్క చేస్తుంద‌నే ఆశ లేకుండా పోతోంది.ఈక్ర‌మంలో జ‌గ‌న్ ఏం చేస్తారు ? ఎలాంటి నిర్ణ‌యాల‌తో ముందుకు సాగుతార‌నేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube