స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి మొబైల్లో ఉండే యాప్ ఏదన్నా ఉంది అంటే అది వాట్సాప్ అని అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.ఎందుకంటే వాట్సాప్ అనేది ఇప్పుడు అందరికి ఉపయోగకరంగా మారిపోయింది.
ఎవరికన్నా మెసేజెస్, ఫొటోస్, వీడియోస్ షేర్ చేయాలన్న ప్రతి ఒక్కరు వాట్సాప్ ను వినియోగించుకుంటున్నారు.అయితే ఒక ఫోన్ నెంబర్ కి ఒక వాట్సాప్ అకౌంట్ మాత్రమే ఉపయోగించగలము.
ఒకవేళ మన దగ్గర రెండు ఫోన్లు ఉంటే ఏదో ఒక ఫోన్లో మాత్రమే వాట్సాప్ ను ఉపయోగించడం కుదురుతుంది.కొత్త ఫోన్ కొన్నాగాని అందులో వాట్సాప్ తీసేసి డేటాను బ్యాక్ అప్ చేసుకుని న్యూ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి.
కానీ ఈ చిన్న టెక్నీక్ కనుక మీరు చేస్తే రెండు ఫోన్లలో కూడా వాట్సాప్ ను యూస్ చేయవచ్చు.ఒక ఫోన్ లో వాట్సాప్ వెబ్ వర్షన్ వాడితే ఎంచక్కా రెండు ఫోన్లలో కూడా వాట్సాప్ చూసుకోవచ్చు.
అయితే వాట్సాప్ వెబ్ వర్షన్ అనేది వాట్సాప్ యాప్ మాదిరి అనుభూతిని ఇవ్వలేదు.మెసేజ్ లు చేసుకోవడం లాంటివి మాములుగా చేసుకోవచ్చు.
అయితే దీనికోసం మీరు ఏమి చేయాలనంటే ముందుగా మీరు వాట్సాప్ ఇన్స్టాల్ చేయని ఫోన్లో ఇంటర్నెట్ బ్రోజర్ ఓపెన్ చేయండి.ఆ తరువాత సెర్చ్ లో వాట్సాప్ వెబ్ డాట్ కామ్ లోకి వెళ్ళాలి.
వెబ్ పేజ్ ఓపెన్ చేసాక కుడివైపు ఉన్న మూడు చుక్కల బటన్ ను క్లిక్ చేసి డెస్క్ టాప్ సైట్ ను ఎంచుకోవాలి.అప్పుడు మీకు వేరే పరికరంతో లింక్ చేసుకోవడానికి ఉపయోగపడే క్యూ ఆర్ కోడ్ కనిపిస్తుంది.

అప్పుడు వెంటనే వేరే ఫోన్లో ఉన్న వాట్సాప్ ఓపెన్ చేసి కుడివైపు ఉన్న మూడు చుక్కల దగ్గర క్లిక్ చేస్తే లింక్ ఏ డివైస్ అనే అప్షన్ కనిపించగానే దాని మీద క్లిక్ చేయండి.అప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ అనే అప్షన్.అప్పుడు మొదటి ఫోన్ లో ముందుగా ఓపెన్ చేసిన క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయాలి.అంతే మొదటి ఫోన్ లో కూడా రెండో ఫోన్ లో ఉన్నా వాట్సాప్ ఖాతా ఓపెన్ అయిపొతుంది.
పైన చెప్పిన విధంగా చేస్తే ఒకే వాట్సాప్ నెంబర్ తో రెండు ఫోన్లలో కూడా వాట్సాప్ ను వాడుకోవచ్చు.ఇంకెందుకు ఆలస్యం… మీ దగ్గర రెండు ఫోన్లు ఉంటే ఈ ట్రిక్ పాటించండి మరి.







