ఇటీవల రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో.అక్కడ ఇతర దేశాలకు చెందిన వాళ్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
యుద్ధం నేపథ్యంలో భారత దేశానికి చెందిన ఇద్దరు విద్యార్థులు కూడా మృతి చెందారు.ఇటువంటి తరుణంలో అక్కడినుండి ఇండియాకు చెందిన విద్యార్థులను.
తీసుకురావడంలో ప్రధాని మోడీ ఉక్రెయిన్- రష్యా దేశాల అధినేతలతో ప్రత్యేకంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో రెండు దేశాలు భారత్ ప్రభుత్వానికి సహకరించాయి.
మోడీ విన్నపం మేరకు తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించడం జరిగింది.ఈ పరిణామంతో కీవ్, చెర్నిహివ్, సుమీ, ఖార్కివ్, మౌరిపోల్ ప్రాంతాల్లోకి ప్రవేశించే మార్గాలు ఏర్పడ్డాయి.దాదాపు 12 బస్సులతో భారత్ ఎంబసీ అధికారులు… ఈ పట్టణాల లోకి ప్రవేశించి.భారతీయులతో పాటు బంగ్లాదేశ్ కి చెందిన తొమ్మిది మందిని.
మరియు నేపాల్, ట్యూనిషియా కి చెందిన ఒక్కో విద్యార్థిని వెంటబెట్టుకుని.పోల్తావా నుంచి వీరిని రైళ్లలో పశ్చిమ ఉక్రెయిన్ సరిహద్దులకు తరలించనున్నారు.
అక్కడి నుంచి విమానాల్లో వారిని ఇండియాకి తీసుకు రావడం జరిగింది.ఈ సందర్భంగా బంగ్లాదేశ్ పౌరులకు ఇండియా ప్రభుత్వం హెల్ప్ చేయడంతో షేక్ హసీనా.
ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.







