ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనా పరంగా అనుభవం లేకపోయినా గాని.ఏపీలో ఆయన అందిస్తున్న పాలన పట్ల చాలా మంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం మరియు వివిధ పేరుగాంచిన సంస్థల మ్యాగజైన్ లలో జగన్ ప్రభుత్వం ఏపీలో చేస్తున్న పాలనకు భారీ ర్యాంకులు వస్తున్నాయి.దేశంలో ఎంత కాలం నుండి ముఖ్యమంత్రులుగా చేస్తున్న వారికి సైతం పోటీ ఇచ్చే రీతిలో ఏపీలో జగన్ పాలన చేస్తున్నారని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు.
తాజాగా 2021 స్కోచ్ ర్యాంకులలో సత్తా చాటింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.
వరుసగా రెండోసారి స్కోచ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ రాష్ట్రంగా మొదటి స్థానంలో నిలిచింది.
వ్యవసాయం, ఈజ్ ఆఫ్ డూయింగ్, బిజినెస్, పవర్ అండ్ ఎనర్జీ, సామాజిక న్యాయం, నీటి సదుపాయం మొదలగు అంశాలను ప్రామాణికంగా తీసుకుని.స్కోచ్ సంస్థ చేపట్టిన ఈ అవార్డు జాబితాలో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది.
రెండో స్థానంలో వెస్ట్ బెంగాల్, మూడో స్థానంలో ఒడిశా… మిగతా స్థానాలలో వేరే రాష్ట్రాలు నిలిచాయి.తెలంగాణ రాష్ట్రం ఆరో స్థానంలో నిలిచింది.
వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి, పోలీసు రక్షణలో ఫస్ట్ ర్యాంక్ లో ఏపీ నిలిచింది.

జిల్లాల పరిపాలనలో కూడా మొదటి స్థానం దక్కింది.ఈ గవర్నెన్స్ లో రెండో స్థానం.ట్రాన్స్ పోర్ట్ విభాగంలో మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిలిచింది.
ఏది ఏమైనా నా రాష్ట్రంలో ప్రతిపక్షాలు… సీఎం జగన్ ఇష్టానుసారంగా పరిపాలన చేస్తున్నారని విమర్శలు చేస్తున్నా గాని కేంద్రం అదే విధంగా మరికొన్ని పేరుగాంచిన మ్యాగజైన్ సంస్థల సర్వేలలో బయట పడుతున్న లెక్కలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నట్లు ఫలితాలు రావడం గమనార్హం.







