మెగా హీరోలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.నాగబాబు కూడా బుల్లితెరపై షోల ద్వారా సక్సెస్ సాధించారనే సంగతి తెలిసిందే.
చిరంజీవి, పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.చిరంజీవి ఒక్కో సినిమాకు 30 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ గా తీసుకుంటుంటే పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
రాజకీయాల్లో చిరంజీవి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయాల్లో సత్తా చాటడానికి కృషి చేస్తున్నారు.2024 సంవత్సరంలో జనసేన పార్టీకి భారీగా సీట్లు వస్తాయని అభిమానులు భావిస్తుండగా అభిమానుల నమ్మకం నిజమవుతుందో లేదో చూడాల్సి ఉంది.అయితే పవన్ గతంలో మెగా ఫ్యామిలీకి సంబంధించి అభిమానులకు సైతం తెలియని షాకింగ్ సీక్రెట్ ను బయటపెట్టారు.

పవన్ కళ్యాణ్ తన కుటుంబం గురించి, తోబుట్టువుల గురించి మాట్లాడుతూ తమ తల్లిదండ్రులకు చిరంజీవి, నాగబాబు, ఇద్దరు ఆడపిల్లలతో పాటు మరో ముగ్గురు పిల్లలు ఉన్నారని అయితే అనారోగ్య సమస్యల వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్లు చనిపోయారని పవన్ కళ్యాణ్ తెలిపారు.ఒక ఇంటర్వ్యూలో భాగంగా పవన్ వెల్లడించిన ఈ విషయం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

పవన్ కళ్యాణ్ పుట్టకముందే వాళ్లు చనిపోయారని సమాచారం అందుతోంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చే నెల నుంచి వినోదాయ సిత్తం మూవీ రీమేక్ పనులతో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది.అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
సముద్రఖని ఈ సినిమాకు తెలుగులో దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుండటం గమనార్హం.పవన్ వెల్లడించిన సీక్రెట్ విని అభిమానులు అవాక్కవుతున్నారు.







