కరోనా కారణంగా ఆన్ లైన్ క్లాసులు, వర్క్ ఫ్రమ్ హోమ్ లు ఇవ్వడంతో సెల్ ఫోన్ లతో పాటు ఆడియో డివైస్ లకు కూడా డిమాండ్ పెరిగింది.దీంతో కొత్త కొత్త ఫీచర్లతో ఇయర్ ఫోన్లు, ఇయర్‌బడ్స్, హెడ్ఫోన్లను మార్కెట్ లోకి లాంచ్ చేస్తున్నాయి కంపెనీలు.
అందులో భాగంగానే ప్రముఖ సంస్థ బోట్ భారత్‌లో మరో హెడ్‌ఫోన్స్ లాంచ్ చేసింది.అదిరిపోయే ఆకర్షణీయమైన ఫీచర్లతో బోట్ నిర్వాణ 751 విడుదలైంది.
అందరికి అందుబాటులో ఉండేలా బడ్జెట్ ధరలోనే అదిరిపోయే ఫీచర్లను అందించింది.
బోట్ నుంచి యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ ఫీచర్‌తో వచ్చిన తొలి బడ్జెట్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్ ఇదే.
ఏ.ఎన్.సి కోసం ఈ హెడ్‌ఫోన్స్‌కు సెపరేట్ బటన్ కూడా ఉంది.దీంతో పాటు ఎన్నో అదిరిపోయే స్పెసిఫికేషన్లతో ఈ హెడ్‌ఫోన్స్ వచ్చింది.
అలాగే ఎక్కువ బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ చార్జింగ్ సహా ఎన్నో ఆకట్టుకునే ఫీచర్లు దీంట్లో ఉన్నాయి.

స్పెసిఫికేషన్స్.
సౌండ్ క్వాలిటీ కొరకు 40 ఎంఎం డ్రైవర్లు ఈ హెడ్‌ఫోన్స్‌లో ఉన్నాయి.బయటి శబ్దాలు వినపడకుండా ఉండేందుకు ఈ యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ ఉపయోగపడుతుంది.
అలాగే ఒక్కసారి ఛార్జింగ్ ఫుల్ అయితే.దాదాపు 65 గంటల పాటు ఈ హెడ్‌ఫోన్స్‌ను వినియోగించుకోవచ్చని బోట్ సంస్థ పేర్కొంది.ఒకవేళ యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ ను ఆన్ చేసి ఉంచినట్లయితే.50 గంటల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుంది.మరోవైపు ఫాస్ట్ చార్జింగ్ ద్వారా.10 నిమిషాలు చార్జ్ చేసి దాదాపు 10 గంటల పాటు ఈ హెడ్‌ఫోన్‌ను వాడుకోవచ్చు.
సాధారణంగా ఏ.ఎన్.సి ఆప్సన్ ఉన్న హెడ్ఫోన్ల ధర మార్కెట్ లో రూ.5000 పైన ఉండగా.బోట్ సంస్థ మాత్రం దీన్ని రూ.3,999 కు మాత్రమే అందజేస్తుంది.







