అశ్లీల వీడియోలు త‌యారు చేయ‌డంలో టాప్‌లో ఆ దేశాలు..

యూత్‌ను అత్య‌ధికంగా ప్రభావితం చేసే వాటిల్లో అశ్లీల వీడియోలు ఉంటాయ‌నేది అంద‌రికీ తెలిసిందే.

ఇక ఈ పోర్నోగ్రఫీ కోసం ఇప్ప‌టికే చాలా దేశాల్లో చిన్నారులతో పాటుగా పేద మహిళలను కూడా చాలా కిరాత‌కంగా వేధింపులకు గురిచేస్తున్న సంఘ‌ట‌న‌లు కూడా అనేకం మ‌నం చూస్తూనే ఉన్నాం.

ఇక ఈ అశ్లీల వీడియోల‌ను కూఆ ఆన్‌లైన్‌లో చూస్తున్న వారు ఇన్ డైరెక్టుగా వాటిని స‌పోర్టు చేస్తున్న‌ట్టే చెప్పొచ్చు.అయితే ఇంత ప్ర‌మాద‌క‌ర‌మైన ఈ అశ్లీల వీడియోల‌ను కట్టడి చేసేందుకు అన్ని దేశాల ప్ర‌భుత్వాలు ప్ర‌య‌త్నిస్తున్నా కూడా వాటితో ఆశించిన ఫలితాలు రావట్లేద‌నే చెప్పాలి.

నిజానికి చాలామంది డైరెక్టుగా ఈ అశ్లీలాన్ని ఛీకొట్టినా కూడా గుట్టుచప్పుడు కాకుండా వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్న వారే చాలామంది ఉన్నారు.ఎందుకంటే పోర్న్ అనేది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఇప్పుడు భాగం అయిపోయింది.

నిజానికి స్మార్ట్ ఫోన్ల వాడ‌కం పెరిగిన త‌ర్వాత ఈ పోర్న్ వీడియోల‌ను చూసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.అయితే ఈ పోర్నోగ్రఫీ కంటెంట్‌ను ప్ర‌పంచంలో ఏ దేశాలు ఎక్కువ‌గా త‌యారు చేస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

నిజానికి ఈ పోర్న్ కంటెంట్‌ను తయారు చేస్తున్న దేశాల్లో మ‌న దేశం అయిన ఇండియా కూడా ఉంది.ఎక్క‌డో అనుకునేరు టాప్‌లోనే నిల‌బ‌డింది మ‌న దేశం.

ఈ విధ‌మైన అశ్లీల కంటెంట్ త‌యారు చేస్తున్న టాప్ 15 దేశాల మ‌న దేశం ఏకంగా 8వ ర్యాంకు తెచ్చుకుంది.ఇక 24.52శాతం కంటెంట్ తో ప్ర‌పంచంలోనే అగ్రస్థానంలో అమెరికా ఉండ‌టం విశేషం.ఇక దాని త‌ర్వాత బ్రిటన్, మూడో స్థానంలో జర్ననీ, బ్రెజిల్, ఆ త‌ర్వాత ఫ్రాన్స్ దేశాలు ఉన్నాయి.

దాదాపు డెవ‌ల‌ప్ అయిన దేశాల్లోనే ఈ విధ‌మ‌న కంటెంట్ ఎక్కువ‌గా త‌యార‌వుతోంది.కానీ ఇక్క‌డ విషయం ఏంటంటే మ‌న దేశం పెద్ద‌గా డెవ‌ల‌ప్ కాకున్నా గానీ ఈ విధ‌మైన కంటెంట్ లో మాత్రం ముందు వ‌రుస‌లో ఉంది.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు